Advertisement

పటాస్ లాంటి కుర్రాడ.. సరిలేరు నీకెవ్వరు!

Posted : January 23, 2022 at 7:35 pm IST by ManaTeluguMovies


టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకులుగా ఎస్.ఎస్.రాజమౌళి.. కొరటాల శివ వంటి దర్శకుల పేర్లు లిఖితమై ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న మరో పేరు అనీల్ రావిపూడి. ఏ సినిమా చేసినా కనీస హిట్టు గ్యారెంటీ. క్రిటిక్స్ ప్రశంసించని `సరిలేరు నీకెవ్వరు` కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. పటాస్ చిత్రంతో మొదలైన ప్రయాణం సరిలేరు నీకెవ్వరు వరకూ అజేయంగా సాగింది. ఏడేళ్ల క్రితం 23జనవరి రోజున పటాస్ రిలీజై గొప్ప విజయం సాధించింది.

7 సంవత్సరాల క్రితం అనిల్ రావిపూడి టాలీవుడ్ అత్యంత విజయవంతమైన `పటాస్`తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నందమూరి కళ్యాణ్రామ్- శ్రుతి సోథి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్-కామెడీ నేటికీ అభిమానులకు ఇష్టమైన సినిమా. బుల్లితెరపై గొప్ప టీఆర్పీ అందుకునే సినిమాగా రికార్డుల్లో ఉంది.

ఈ సినిమాలో కామెడీ యాక్షన్ ప్రతిదీ హైలైట్. నటీనటులందరి డైలాగ్ లు.. పాటలు నటప్రదర్శనలు ప్రతిదీ గుర్తింపు పొందాయి. సినిమా హాళ్లలో హూట్ విజిల్స్ చప్పట్లతో హోరెత్తాయంటే ఎంతగా కిక్కిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ టాలీవుడ్ సినీ-అభిమానుల జ్ఞాపకాలలో నిలిచి ఉంది ఈ చిత్రం.

పటాస్ సినిమా విడుదలై 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అనిల్ రావిపూడి ట్విట్టర్ లో హృదయపూర్వక కృతజ్ఞతా పత్రాన్ని రాశారు. తన తొలి చిత్రంతోనే విజయాన్ని ఇచ్చిన బృందానికి అభిమానులు వీక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనిల్ ఇలా వ్రాశాడు. “నా మొదటి చిత్రం #పటాస్కి 7 సంవత్సరాలు గడిచాయి.. కానీ జ్ఞాపకాలు శాశ్వతంగా ఉన్నాయి. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు @NANDAMURIKALYAN గారూ & తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు #7YearsForPataas @NTRArtsOfficial“ అని వ్యాఖ్యానించారు.

`పటాస్` ఒక పోలీసు కథ. కళ్యాణ్ కృష్ణ నగరానికి బదిలీ పై వచ్చి GK అనే శక్తివంతమైన విలన్ తో స్నేహం చేసి GK సోదరుడితో అత్యాచారానికి గురికాకుండా మరొక అమ్మాయిని రక్షించే ప్రయత్నంలో ఒక మూగ అనాధ బాలిక దారుణంగా చంపబడిన తరువాత తన అనైతిక వ్యవహారాల గురించి పశ్చాత్తాపపడతాడు. ఆ తర్వాత ముఠాతో గొడవపడతాడు. ఈ చిత్రంలో సాయి కుమార్- అశుతోష్ రానా- శ్రీనివాస రెడ్డి- M. S. నారాయణ- మధునందన్- జయ ప్రకాష్ రెడ్డి- పోసాని కృష్ణ మురళి- పవిత్ర లోకేష్ తో పాటు పలువురు ఇతర పాత్రలు పోషించారు.

నందమూరి కళ్యాణ్రామ్ కెరీర్ లో `పటాస్` బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ తన హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మించారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ గా సర్వేష్ మురారి.. ఎడిటర్గా తమ్మి రాజు.. మ్యూజిక్ కంపోజర్గా సాయి కార్తీక్ పని చేశారు.


Advertisement

Recent Random Post:

Monkey Man | Official Trailer 2

Posted : March 23, 2024 at 5:38 pm IST by ManaTeluguMovies

Monkey Man | Official Trailer 2

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement