ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పవన్ కు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇస్తున్నారు. నార్మల్ గా ఎప్పుడూ హీరోల మధ్య ఎలాంటి గొడవ లేకపోయినా… వారి మధ్య సమస్యలు ఉన్నాయనుకొని వాళ్ల అభిమానులు గొడవ పడుతుంటారు. తాజాగా కూడా అలాంటి ఓ ఘటనే చోటుచేసుకుంది. ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తుండగా.. అందుకు మేం సపోర్టం చేయమంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. దానికి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. అసలు వాళ్లు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి ఎందుకలా ప్రవర్తిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసకుందాం.

ఇటీవల పవన్ కల్యాణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడంతో రామ్ చరణ్ కు అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే ఇటు నందుమూరి మెగా హీరోకు మధ్య చిచ్చు రేపింది.

పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిష్టాత్మక హెచ్సీఏ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే ఈ వేదికపై బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్ ను రాం చరణ్ ద్వారా ప్రకటింపజేయడం స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కల్గించిందన్నారు.

రామ్ చరణ్ కు దర్శకుడు రాజమౌళికి చిత్ర బృందానికి అభినందనలు పేర్కొన్న పవన్ కల్యాణ్… చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

పవన్ కల్యాణ్ తన ప్రకటనలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం వారి ఆగ్రహానికి కారణం అయింది. సినిమాలో ఇద్దరూ ఒకే స్థాయిలో కనిపించినప్పటికీ.. జనసేనాని ఆయన పేరు ప్రస్తావించకపోవడం బాధ కల్గిస్తోందంటూ చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అందుకోసమే పవణ్ కల్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్లే ఆయన పేరు ప్రస్తావించి ఎన్టీఆర్ పేరు ప్రస్తావించడం లేదని ఫైర్ అయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో మీరు పొత్తు పెట్టుకుంటే మేం సపోర్ట్ చేయమని చెబుతున్నారు. ఈ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా స్పందిస్తున్నారు. అటు మెగా ఇటు నందమూరి ఫ్యాన్స్ గొడవ పడుతున్నారు.

Exit mobile version