ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

పెద్ద స్టార్లు అవకాశాలివ్వరు.. అందుకే నా సినిమాకి నేనే హీరో

తమిళ చిత్ర పరిశ్రమ లో ప్రామిసింగ్ నటీమణుల లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఆసక్తికరంగా ఐశ్వర్య తెలుగమ్మాయి. రచ్చ గెలిచి ఇంట కూడా కొన్ని సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లోను నటించిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య ప్రస్తుతం వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది. ఇటీవల ప్రైమ్ వీడియో నిర్వహించిన మైత్రి ఈవెంట్ లో నాయికా ప్రధాన చిత్రాల ను ఎందుకు చేయడం ప్రారంభించిందో ఐశ్వర్య వివరించింది. ఫ్రీవీలింగ్ చాట్ లో ఐశ్వర్య మాట్లాడుతూ టాప్ సీక్రెట్ ని బహిరంగంగా ఓపెనైంది. అరుదుగా కొందరు స్టార్లు తప్ప చాలా మంది పెద్ద హీరోలు తమ సినిమా లలో పాత్ర ను ఆఫర్ చేయలేద ని అందుకే ‘నా సినిమాల కు నేనే అధిపతి’గా ఉండాల ని నిర్ణయించుకున్నానని ఐశ్వర్య వెల్లడించింది.

నెల్సన్ వెంకటేశన్ ఇటీవలి సినిమా ‘ఫర్హానా’లో ఐశ్వర్య రాజేష్ తన నటన కు ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం సోనీ లైవ్ లో ప్రసారం అవుతోంది. ఫర్హానా కు సంబంధించిన వివాదాల ను ప్రస్తావించగా ‘మతం ఎప్పుడూ దేనికీ అడ్డంకి కాదు’ అని ఐశ్వర్య చెప్పింది. ప్రైమ్ వీడియో మైత్రి: ఫిమేల్ ఫస్ట్ కలెక్టివ్ చెన్నైలో నిర్వహించారు. మాళవిక మోహనన్ – ఐశ్వర్య రాజేష్ – మధు- రచయిత-నిర్మాత రేష్మా ఘటాల- దర్శకరచయిత స్వాతి రఘురామన్- సినిమాటోగ్రాఫర్ యామిని యజ్ఞమూర్తితో పాటు అమెజాన్ అధినేత అపర్ణ పురోహిత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘కాకా ముట్టై’ విజయం తర్వాత తాను సినిమాలు చేయకుండా గ్యాప్ రావడానికి కారణాల ను తెలిపింది. “నేను కాకా ముట్టై అనే సినిమా చేసినప్పుడు సినీ పరిశ్రమ మొత్తం నన్ను పిలిచి మెచ్చుకుంది. చుట్టూ అంతా బాగానే జరుగుతోంది. కానీ నాకు ఎలాంటి ఆఫర్లు రాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా నాకు అవకాశాలు రాలేదు” అని తెలిపింది. నా ఫిల్మోగ్రఫీలో ధనుష్- విజయ్ సేతుపతి- శివకార్తికేయన్ – దుల్కర్ సల్మాన్ వంటి కొందరు పెద్ద నటులు తప్ప నా పని ని మెచ్చిన ఇతర నటీనటులు వారి ఏ సినిమా లోనూ నాకు అవకాశం ఇవ్వలేదు. సమస్య ఇక్కడ హీరో హీరోయిన్ కి నడుమ ఒక నిష్పత్తి ఉంది. మీకు నిర్దిష్ట మార్కెట్ విలువ – డిజిటల్ విలువ – OTT విలువ – శాటిలైట్ విలువ ఉండాలి. ఈ రోజుల్లో అక్కడ ఆశించిన స్థాయి లో ఉండాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండడం ముఖ్యం” అని ఐశ్వర్య వ్యాఖ్యానించారు.

ఆపై నేను మహిళా ప్రాధాన్య చిత్రాల లో నటించాల ని అనుకున్నాను. ‘కనా’ అనే పోస్టర్ ఆకర్షించింది. నేను ఒక సోషల్ మీడియా పోస్ట్ లో చూశాను. తర్వాత నేను స్త్రీ-కేంద్రీకృత చిత్రాలను చేయడం ప్రారంభించాను. ఇప్పటికే నేను సోలో గా దాదాపు పదిహే ను సినిమాలు చేశాను. కానీ ఈరోజు కూడా ఇంత పెద్ద హీరోలు నన్ను ఎందుకు పిలవడం లేదో? అని ఆలోచిస్తున్నాను. కానీ ‘నా సినిమాకి నేనే హీరో గా చేస్తా’ అని డిసైడ్ అయ్యాను. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను పెద్ద హీరోల తో అవకాశాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. నాకు నా స్వంత ప్రేక్షకులు ఉన్నారు!” అని ఆమె వ్యాఖ్యానించింది.

ఐశ్వర్య చివరిసారి గా రోహిన్ వెంకటేశన్ తీసిన ‘తీర కాదల్’లో కనిపించింది. దాదాపు అరడజను సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశ లో ఉన్నాయి. ధృవ నచ్చతిరమ్- మోహన్ దాస్ – తీయవర్ కులైగల్ నడుంగ – అజయంతే రాండమ్ మోషణం- పులిమాడ చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Exit mobile version