చివరికి క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ కూడా చేశాడు కానీ.. అవి కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మధ్యలో సినిమాలు వదిలేసి బిగ్ బాస్ షోకు వెళ్లాడు. దాని ద్వారా మళ్లీ కొంత కాలం వార్తల్లో నిలిచాడు. షో నుంచి బయటికొచ్చాక మరుగున పడ్డ రంగు అనే సినిమాను బయటికి తీసి ఏదో హడావుడి చేశాడు కానీ.. దాన్ని కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. అయినా ఆశలు కోల్పోకుండా ఓ సినిమాను లైన్లో పెట్టాడు తనీష్.
తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. టైటిల్ చూస్తే చాలా గ్రాండ్‌గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇంటెన్స్‌గా తీర్చిదిద్దారు. ఓ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో రౌడీల్ని చంపేసి రక్తంలో తడిసి ముద్ద అయి కనిపిస్తున్నాడు తనీష్. ఎ జర్నీ ఆఫ్ యన్ ఎమోషనల్ కిల్లర్ అంటూ ఈ సినిమాకు క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి హీరోది నెగెటివ్ షేడ్స్ ఉన్న కిల్లర్ పాత్ర అని అర్థమవుతోంది.
సినిమా ఎలా ఉంటుందో ఏమో కానీ.. టైటిల్, ఫస్ట్ లుక్ అయితే ఆకర్షణీయంగా అనిపిస్తున్నాయి. కాకపోతే హీరోకే అస్సలు మార్కెట్ లేదు. పైగా సినిమా తీసింది జానీ అనే కొత్త దర్శకుడు. ఇలాంటి సినిమాల్ని మార్కెట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడమే పెద్ద సవాలు. మరి తనీష్ ఏం చేస్తాడో.. ఈ సినిమాతో అయినా అతడి రాత మారుతుందేమో చూడాలి.