అనుకున్నదే తడవుగా పని కూడా మొదలుపెట్టారు. కానీ ఈ పని ఎంతకీ తెగట్లేదు. సినిమా పట్టాలెక్కట్లేదు. రెండేళ్లకు పైగా చర్చల్లో ఉన్న ఈ సినిమా ఇంకా పట్టాలెక్కట్లేదు. స్క్రిప్టుకు మెరుగులు దిద్ది దిద్ది కళ్యాణ్ అలసిపోతున్నాడు. కానీ ఎంతకీ నాగార్జున పచ్చజెండా ఊపట్లేదు. ఇదిగో ఫలానా నెలలో సినిమా మొదలు అంటారు. కానీ ఆ సమయం వచ్చేసరికి ఏ చప్పుడూ ఉండదు.
కొంత విరామం తర్వాత మరోసారి ‘బంగార్రాజు’ చర్చల్లోకి వచ్చింది. స్క్రిప్టు దాదాపు ఓకే అయినట్లే అని.. నాగార్జున ఇక అడ్డం పడే అవకాశం లేదని.. సినిమా ఈ ఏడాది జూన్లో పట్టాలెక్కబోతోందని అన్నపూర్ణ స్టూడియో వర్గాలు అంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’కు వారం గ్యాప్ ఇచ్చి వచ్చే సంక్రాంతికి ‘బంగార్రాజు’ సినిమాను బాక్సాఫీస్ బరిలో నిలపాలని నాగ్ భావిస్తున్నాడని.. అందుకే ఈ ఏడాది ద్వితీయార్దంలో సినిమా పూర్తి చేయాలని అనుకుంటున్నాడని అంటున్నారు.
సంక్రాంతికి మరీ రిస్క్ అనుకుంటే క్రిస్మస్‌కే సినిమాను రిలీజ్ చేసేయాలనుకుంటున్నాడని కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఈసారి మాత్రం ఏ మార్పూ ఉండదని.. ఈ ఏడాది జూన్లో ‘బంగార్రాజు’ పట్టాలెక్కడ పక్కా అంటే పక్కా అని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో?