Advertisement

బాహుబ‌లిని గుర్తు చేసిన విక్ర‌మ్

Posted : April 18, 2020 at 12:40 pm IST by ManaTeluguMovies

త‌మిళ న‌టుడు విక్ర‌మ్ నిఖార్స‌యిన హిట్టు కొట్టి ద‌శాబ్దంన్న‌ర దాటుతోంది. ఒక ద‌శ‌లో వ‌రుస‌గా అప‌రిచితుడు, సామి, పితామ‌గ‌న్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లు ఇచ్చిన విక్ర‌మ్.. ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌తో అల్లాడిపోయాడు. అత‌డి నుంచి గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంలో సంతృప్తిక‌ర చిత్ర‌మే రాలేదు.

అయినా స‌రే.. విక్ర‌మ్‌తో ద‌ర్శ‌కులు భారీ చిత్రాలు లైన్లో పెడుతూనే ఉన్నారు. అత‌ను హీరోగా గ‌త ఏడాది మ‌హావీర్ క‌ర్ణ పేరుతో ఓ మెగా ప్రాజెక్టు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. క‌ర్ణుడి జీవిత క‌థ‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బ‌డ్జెట్ ఏకంగా రూ.300 కోట్లు కావ‌డం విశేషం. మ‌ల‌యాళ ద‌ర్శ‌కుడు విమల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ జోరుగానే సాగుతుండ‌గా.. క‌రోనా బ్రేక్ వేసింది.

శుక్ర‌వారం విక్ర‌మ్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు ఓ కానుక ఇచ్చారు. సినిమా లొకేష‌న్ నుంచి విక్ర‌మ్ క‌ర్ణుడి అవ‌తారంలో ఉన్న లుక్‌ను ప‌రిచ‌యం చేస్తూ వీడియో వ‌దిలారు. విక్ర‌మ్ విల్లు అందుకుని బాణం గురిపెడుతున్న దృశ్యాన్ని చూపించారు. విక్ర‌మ్ ధ‌రించి యోధుడి కాస్ట్యూమ్స్.. బాణం వ‌దిలే తీరు చూస్తే అంద‌రికీ బాహుబ‌లిలో ప్ర‌భాసే గుర్తుకొస్తున్నాడు. లొకేష‌న్లో సెట‌ప్ చూసినా బాహుబ‌లి దృశ్యాలు త‌ల‌పుల్లోకి వ‌స్తున్నాయి.

గ్రాండియ‌ర్ ప‌రంగా చూస్తే బాహుబ‌లికి దీటుగా ఈ సినిమాను తీర్చిదిద్దేలాగే ఉంది. మహాభారతంతో పాటు మరిన్ని గ్రంథాల్ని అధ్యయనం చేసి కర్ణుడి పాత్రను పరిపూర్ణంగా తెరపైన ఆవిష్కరించబోతున్నారట. ఏకంగా 32 భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతుండ‌టం విశేషం. అత్య‌ధిక భాష‌ల్లో విడుద‌ల కానున్న భార‌తీయ చిత్రం ఇదే కానుంది. యునైటెడ్ కింగ్ డమ్ ఫిలిమ్స్ అనే విదేశీ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది. వ‌చ్చే ఏడాది సినిమా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.


Advertisement

Recent Random Post:

షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి | Shabbir Ali | CM Revanth Reddy | Ramadan Celebrations

Posted : April 11, 2024 at 11:45 am IST by ManaTeluguMovies

షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి | Shabbir Ali | CM Revanth Reddy | Ramadan Celebrations

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement