ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్ బాస్ 8 : డేంజర్ జోన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. సీజన్ 8 లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్స్ గా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించారు. ఐతే ఈసారి కొత్తగా ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారినే వైల్డ్ కార్డ్ గా పంపించారు. ఐతే మొదటి వారమే వైల్డ్ కార్డ్స్ లో మెహబూబ్, గంగవ్వ నామినేట్ అవ్వగా ఆ ఇద్దరు సేఫ్ అయ్యారు. ఇక ఐతే ఈ వారం నామినేషన్స్ లో హౌస్ నుంచి ఏకంగా 9 మంది హౌస్ మెట్స్ ఉన్నారు.

వారిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో గౌతం, హరితేజ, టేస్టీ తేజా నామినేషన్స్ లో ఉన్నారు. వీరితో పాటు ఓజీ క్లాన్ నుంచి నిఖిల్, మణికంఠ, యష్మి, ప్రేరణ, పృధ్వి, నబీల్ నామినేషన్స్ లో ఉన్నారు.. బిగ్ బాస్ సీజన్ 8లో నామినేషన్స్ లో ఉన్న తొమ్మిది మందిలో లీస్ట్ ఓటింగ్ ఎవరికి అన్నది చూస్తే అది గౌతం కృష్ణకే అని తెలుస్తుంది.

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న గౌతం కృష్ణ నామినేషన్స్ టైం లో అవినాష్, రొహిణిలతో వాదన జరిపాడు. అతన్ని అశ్వథ్థామ 2.ఓ అని అంటే ఊరకనే ట్రిగ్గర్ అవుతున్న గౌతం నామినేషన్స్ లో మరోసారి తను లాస్ట్ సీజన్ మైండ్ సెట్ ని చూపించాడు. అవినాష్ మీద గట్టిగా అరుస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత ఈ సీజన్ లో గౌతం బాధపడటం కూడా జరుగుతుంది. సీజన్ 7 లో స్ట్రాంగ్ గా అనిపించిన గౌతం సీజన్ 8 లో తన ఎమోషనల్ సైడ్ కూడా చూపిస్తున్నాడు.

ఐతే ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ అనాలసిస్ ప్రకారం ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోనే ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. అది గౌతం కృష్ణకే ఎక్కువ ఛాన్సులు ఉన్నట్టు అనిపిస్తుండగా తేజా కూడా వెళ్లే ఛాన్స్ లు ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఆడియన్స్ ఎవరిని హౌస్ లో ఉంచాలి ఎవరిని బయటకు పంపించాలన్నది నిర్ణయించాల్సి ఉంది. ఈసారి ఓజీ, రాయల్ క్లాన్స్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉన్నారు. ఎవరి స్టామినా ఎంత అన్నది ఈ వీక్ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే తెలుస్తుంది.

Exit mobile version