Advertisement

బుట్టబొమ్మని విక్టరీకి చెల్లిని చేసేశారు

Posted : May 17, 2022 at 4:07 pm IST by ManaTeluguMovies

విక్టరీ వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ్ తో కలిసి నటించిన ఫన్ ఎంటర్ టైనర్ `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మించారు.

తమన్నా మెహ్రీన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ అంజలి సునీల్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. క్రేజీ కాస్టింగ్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ మే 27న భారీ స్థాయిలో ప్రేక్షకలు ముందుకు రాబోతోంది.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు నెట్ ఫ్లిక్స్ కోసం `రానా నాయుడు` పేరుతో ఓ భారీ వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. రానా కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ వెబ్ యాక్షన్ డ్రామా షూటింగ్ గత కొంత కాలంగా ముంబైలో జరుగుతోంది. అక్కడే వుంటూ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ని పూర్తి చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఇదే ఏడాది బాలీవుడ్ మూవీ కూడా చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే బయటికి వచ్చేసింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హాద్ సామ్జీ ఓ భారీ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాని తెరపైకి తీసుకురాబోతున్నారు. `కభీ ఈద్ కభీ దివాళీ` పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటిస్తూ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలోని విలే పార్లేలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఆకట్టుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అన్నా చెల్లెళ్లుగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో వీరిద్దరి మధ్య వున్న అనుబంధం వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని తెలుస్తోంది. పూజా హెగ్డే ఇటీవలే ఈ మూవీ షూటింగ్ లోకి ఎంటరైంది. విక్టరీ వెంకటేష్ వచ్చే నెల నుంచి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని డిసెంబర్ 30న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇటీవల విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ ఫన్ రైడ్ `ఎఫ్ 3` కోసం పూజా హెగ్డే పాల్గొనగా విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లపై ఓ ప్రత్యేక గీతాన్ని షూట్ చేశారు. ఆ సాంగ్ ని ఇటీవలే విడుదల చేశారు. కూడా. అప్పడే బుట్టబొమ్మని విక్టరీ వెంకటేష్ కు చెల్లెలిని చేయడం తో వెంకీ ఫ్యాన్స్ షాకవుతున్నారట.


Advertisement

Recent Random Post:

సంధ్య ఆక్వా కంపెనీ బస్సుపై సందేహం | Sandhya Aqua Company Documents Found in Bus | CBI | Vizag Drugs

Posted : March 25, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

సంధ్య ఆక్వా కంపెనీ బస్సుపై సందేహం | Sandhya Aqua Company Documents Found in Bus | CBI | Vizag Drugs

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement