ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బెల్లంకొండ సినిమా మార్కెట్ కాలేదు

స్ట్రగులింగ్ హీరో బెల్లంకొండ, స్ట్రగులింగ్ డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా కందిరీగ 2 (వర్కింగ్ టైటిల్). ఇధ్దరు విలన్ల మధ్యలో హీరో చేరి ఆటాడుకునే జోనర్ సినిమా. ఈస్ట్ గోదావరి బయ్యర్ సుబ్రహ్మణ్యం నిర్మాతగా మారి చేస్తున్న సినిమా. ఈ సినిమా బిజిసెన్ క్లోజ్ అయిపోయిందంటూ వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదు. ఈ సినిమా బిజినెస్ ఇంకా ఓపెన్ గానే వుంది.

మాస్ డైరక్టర్, మాస్ హీరో కాంబినేషన్ కావడంతో కాస్త రేటు వస్తుందనే ఆశ అయితే వుంది. నల్లమలుపు బుజ్చి తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులకు 13 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారు. అయితే నిర్మాత 15 కోట్ల దాటి వస్తుందని వెయిట్ చేస్తున్నారు.

సినిమా శాటిలైట్ డిజిటల్ కలిపి జెమిని ఆరు కోట్ల వరకు అయిపోయింది. హిందీ డబ్బింగ్ బేరాలు జరుగుతున్నాయి. ఇటీవల హిందీ మార్కెట్ బాగా పడిపోయింది. ఈ సినిమా వరకు పది కోట్లు వస్తే తప్ప కిట్టుబాటు కాదు. ఎందుకంటే సినిమాకు అన్నీ కలిపి 30 కోట్ల వరకు బడ్జెట్ అయిపోతోంది.

దేవీశ్రీప్రసాద్, ప్రకాష్ రాజ్, సోనూసూద్ వగైరాల రెమ్యూనిరేషన్లు వున్నాయి. అందువల్ల అన్నీ కలిపి 30 కోట్ల మేరకు చేరిపోతుంటే, నాన్ థియేటర్ మీద 15 కోట్లు, థియేటర్ మీద 15 కోట్లు రావాలి. లేదూ అంటే డెఫిసిట్ అవుతుంది. అందుకే ఆచి తూచి బిజినెస్ క్లోజ్ చేయాలని చూస్తున్నారు.

Exit mobile version