ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

భ‌ర్త ప్రోత్సాహంతోనే శ‌క్తిగా.. న‌య‌న్ కృత‌జ్ఞ‌త‌

ప‌రిశ్ర‌మ అగ్ర క‌థానాయిక‌లు సొంతంగా వ్యాపారాల్లో నిమ‌గ్న‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అనుష్క శ‌ర్మ‌, ప్రియాంక చోప్రా, క‌త్రిన కైఫ్‌, సన్నీలియోన్, సోన‌మ్ క‌పూర్, ఆలియా భ‌ట్.. ఇలా ప్ర‌ముఖ బాలీవుడ్ నాయిక‌లంతా సొంత వ్యాపారాల్లో రాణిస్తూ సంచ‌ల‌నంగా మారుతున్నారు.

ఇప్పుడు ఇదే జాబితాల త‌లైవి న‌య‌న‌తార కూడా చేరింది. న‌య‌న్ సౌత్ అగ్ర క‌థానాయిక‌గా వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నా కానీ, త‌న భ‌ర్త విఘ్నేష్ తో క‌లిసి కొన్ని కంపెనీల‌ను స్థాపించి వాటిని విజ‌య‌వంతంగా ర‌న్ చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు.

నయనతార తన సొంత బ్యూటీ బ్రాండ్ ‘9 స్కిన్‌’ విజ‌య‌వంతంగా ర‌న్ అవుతోంది. ది లిప్ బామ్ కంపెనీ .. ఫెమి అనే శానిటరీ ప్యాడ్ కంపెనీల‌తోను భారీ ట‌ర్నోవ‌ర్ వైపు దూసుకెళుతోంది. అలాగే రౌడీ పిక్చ‌ర్స్ పేరుతో సొంత బ్యాన‌ర్ ని స్థాపించి ఇందులో భ‌ర్త‌తో క‌లిసి సినిమాల‌ను నిర్మిస్తోంది.

ఇప్పుడు నయనతారను ఇటీవల ఒక పత్రిక `మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌ ఇన్ బిజినెస్` టైటిల్ తో సత్కరించింది. జోయా అక్తర్, టైగర్ బేబీ డైరెక్టర్ కో-ఫౌండర్, సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పూరీ బుచ్, సంగీత రెడ్డి అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ జాయింట్ ఎండీ.. సహా మరో ముగ్గురు నిష్ణాతులైన మహిళలతో ఈ గౌర‌వాన్ని న‌య‌న్ షేర్ చేసుకోవ‌డం విశేషం. అయితే తాను ఈ ఘ‌న‌త సాధించ‌డం వెన‌క భ‌ర్త ప్రోత్సాహానికి న‌య‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. నా ప్రియమైన భర్త, నాకు పెద్దగా కలలు కనడం నేర్పినందుకు ధన్యవాదాలు అని అంది. మ్యాగజైన్ `ఫర్ ది హానర్`కు కృతజ్ఞతలు తెలియజేసింది. త‌మ వ్యాపార సంస్థ‌ల అభివృద్ధిలో భాగ‌స్వాములైన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపింది.

ఇంటర్వ్యూలో నయనతార ఒక వ్యాపారవేత్తగా తన వ్యూస్ ని వెల్ల‌డించింది. కేవ‌లం లాభాలు మాత్ర‌మే చూడ‌కుండా వ్యాపారాలు ప్రజల జీవితాలకు సానుకూలంగా సహకరించాలని న‌య‌న్ నొక్కి చెప్పారు. ఉత్ప‌త్తులు వినియోగ‌దారుల ఫ్రెండ్లీగా ఉండాల‌ని అభిల‌షించారు. నయనతార 75 వ చిత్రం `అన్నపూర్ణి` ఇటీవల విడుద‌లైవిమర్శకులు వీక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది.

ఈ చిత్రం ఆమె పాత్ర అయిన అన్నపూర్ణికి వంట చేయడం పట్ల ఉన్న అభిరుచి ఎలాంటిది? అన్న‌దే సినిమా. అయితే ఆమె సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో మాంసాన్ని తినడం లేదా ముట్టుకోవడం విష‌యంలో కోపం ప్ర‌ద‌ర్శిస్తుంది. అన్నపూర్ణి ఒక హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్‌లో రహస్యంగా చేరుతుంది. అలా చేస్తూనే తాను MBA చదువుతున్నానని తన కుటుంబ సభ్యులకు చెబుతుంది. కానీ వంటగదిలో ప్రమాదం జరిగిన తర్వాత అన్నీ మారిపోతాయి. ఇదేగాక‌..త‌దుప‌రి టెస్ట్, థని ఒరువన్ 2, 1960 మన్నంగట్టి, కన్నప్ప చిత్రాలతో అద్భుతమైన లైన‌ప్‌ని క‌లిగి ఉంది.

Exit mobile version