కానీ ఇవే జాగ్రత్తలను, హెచ్చరికలను ‘మహానుభావుడు’ అనే చిత్రం ద్వారా చేస్తే జనాలు పట్టించుకోలేదు. అంతేకాదు, ఇలాంటి మాటలను విని నవ్వుకున్నారు. చెప్పిన వాళ్లను అవహేళన చేశారు. శుభ్రత, భౌతిక దూరం ప్రాధాన్యాలకు కాస్తా కామెడీ జోడించి డైరెక్టర్ మారుతి. హీరో(శర్వానంద్)కు ఉన్న అతి ఓసిడి(ఓవర్ క్లీనింగ్ డిజార్డర్)తో వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరించారు. అయితే గతంలో ఈ సినిమా చూసి నవ్వుకున్నాం కానీ ఇప్పుడు అలాంటి పద్ధతులు పాటించక తప్పడం లేదు.
తన సినిమాలో ఏవైతే జాగ్రత్తలు చెప్పారో…నేడు అవే ఆరోగ్యరక్షణ కవచాలుగా మారడంతో హీరో శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశాడు. కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కార్టూన్ రూపంలో శర్వానంద్ తెలిపాడు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతీ ఒక్కరు ‘మహానుభావుడు’గా మారాలి, మారదాం’అంటూ ఆ హీరో ట్వీట్ చేశాడు.
తాజాగా శర్వానంద్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శర్వానంద్ పోస్ట్‌పై నెటిజన్లు పాజిటివ్‌గా స్పందించారు. అప్పట్లో ‘వ్యక్తిగత పరిశుభ్రత గురించి ‘మహానుభావుడు’ చెప్పాడు.. అప్పుడు నవ్వుకున్నాం ఇప్పుడు పాటిద్దాం’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.