ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మహేష్..యాభై కోట్లు మర్చిపోవాల్సిదే?

సూపర్ స్టార్ మహేష్ బాబు..దాదాపు యాభై కోట్లకు కాస్త అటు ఇటుగా రెమ్యూనిరేషన్ తీసుకుంటారని టాక్ వున్న నటుడు. అది చూసి మిగిలిన పెద్ద హీరోలు కూడా వారు కూడా ముఫై నుంచి నలభై వరకు రెమ్యూనిరేషన్లు డిమాండ్ చేస్తున్నారని వార్తలు వున్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోయే పరిస్థితి వచ్చేసింది. కరోనా కల్లోలం కారణంగా రెమ్యూనిరేషన్లలో భారీ కోత పడే అవకాశం కనిపిస్తోంది. లేదూ అదే రెమ్యూనిరేషన్ కావాలి అంటే నిర్మాతలు పూర్తిగా గుల్లయిపోయే అవకాశం సినిమా మేకింగ్ వేళకే క్లియర్ గా కనిపిస్తుంది.

తెలుగు సినిమాకు ఓవర్ సీస్ మార్కెట్ పెద్ద దన్ను. పెద్ద హీరోలకు దాదాపు పది కోట్ల మేరకు మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్ కుప్పకూలింది. మళ్లీ తేరుకోవడానికి టైమ్ పడుతుంది. కనీసం ఆరు నెలలు అని అంచనా. పైగా అమెరికాలోని తెలుగువారు ఇప్పుడు ఉపాధి సమస్యను, వేతనాల కోతను ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా వేలాం వెర్రిగా రేట్లు పెట్టి టికెట్ లు కొనే పరిస్థితి ఉండకపోవచ్చ.

అందువల్ల పెద్ద సినిమాల గ్రాస్ మార్కెట్ లో అయిదారుకోట్లు కనీసం కోత పడుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు అంటే ఓవర్ సీస్ లో కింగ్ అని పేరు వుంది. ఇప్పుడు తొలి ఎఫెక్ఠ్ పడేది ఆయనపైనే కావచ్చు. అయితే అదృష్టం ఏమిటంటే, ఇప్పట్లో ఏ పెద్ద హీరో సినిమా కూడా రెడీగా లేదు. మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్, ఇలా టాప్ హీరోల సినిమాలు ఏవీ ఆరు నెలల లోపు రెడీ కావు.. అందువల్ల అప్పటికి మార్కెట్ సద్దుకుంటుందనే ఆశ వుంది.

అలా సర్దుకోకుంటే పెద్ద హీరోలు అంతా రెమ్యూనిరేషన్ విషయంలో కాస్త సర్దుకోవాల్సి వుంటుంది. దీనికి తోడు ఆర్ధిక మాద్యం కమ్ముకు వస్తుందని, నిరుద్యోగం లేదా జీతాల కోత కాస్త గట్టిగానే వుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల డొమస్టిక్ మార్కెట్ లో కూడా మూడేసి వందలు, అయిదేసి వందలు యూనిఫారమ్ రేట్ పెట్టేసి, టికెట్ లు అమ్మేసి, కోట్లు లాగేద్దామంటే కుదిరే పని కాకపోవచ్చు.

మొత్తం మీద సినిమా బడ్జెట్ లు తద్వారా హీరోల రెమ్యూనిరేషన్లు తగ్గే ప్రమాదం కనిపిస్తోంది.

Exit mobile version