ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మాహాభారతంలో ఆ ఒక్క మాటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమాకు వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి నటించగా అంజలి ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మే 31న భారీగా రిలీజ్ అవుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మరిన్ని విషయాలను దర్శకుడు కృష్ణ చైతన్య మీడియాతో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

దర్శకుడిగా ప్లానింగ్ లో ఉన్న చిత్రాలు ఆలస్యం అవడం, మరీ గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయం నాలో మొదలైంది. అదే విషయాన్ని త్రివిక్రమ్ గారితో పంచుకున్నాను. ఆయన సూచనతో విశ్వక్ కి కథ చెప్పాను. విశ్వక్ కి కథ నచ్చడంతో అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.

గోదావరి అనగానే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉంది అన్నట్టుగా చూపిస్తారు. కానీ నిజానికి మా ప్రాంతంలో కూడా నేరాలు జరుగుతాయి. ప్రాంతాలను బట్టి కాకుండా మనుషులను బట్టి నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ఈ కథ. అయితే ఇది కల్పిత కథనే. దీనిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే.. దీని ద్వారా ఒక మంచి కథను చూపించవచ్చు, ఒక మంచి ఎమోషన్ ను చూపించవచ్చు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ విజువల్ ని చూపించవచ్చు అని భావించాను. నా ఆలోచనకు తగ్గట్టుగా సితార లాంటి మంచి నిర్మాణ సంస్థ దొరికింది. కొందరు ఇది గ్యాంగ్ స్టర్ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇది గ్యాంగ్ స్టర్ మూవీ కాదు.

విశ్వక్ కోసం ఎటువంటి మార్పులు చేయలేదు. మొదట ఏదైతే కథ రాసుకున్నామో.. అదే విశ్వక్ తో చేయడం జరిగింది. అయితే విశ్వక్ తెలంగాణలో పెరిగిన వ్యక్తి కాబట్టి.. గోదావరి మాండలికాన్ని సరిగ్గా చెప్పగలడా అని కొంచెం సందేహం కలిగింది. కనీసం రెండు మూడు నెలలు ట్రైనింగ్ అవసరమవుతుంది అనుకున్నాను. కానీ నెల రోజుల లోపులోనే నేర్చుకొని ఆశ్చర్యపరిచాడు.

మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. కుటుంబమంతా కలిసి చూడొచ్చు. సంభాషణల పరంగా రెండు చోట్ల మాత్రమే మ్యూట్ వేశారు. అవే మీరు ట్రైలర్ లో చూశారు. ట్రైలర్ కి సెన్సార్ అభ్యంతరాలు ఉండవు. అందుకే ఆ సన్నివేశాల్లోని భావోద్వేగాన్ని బాగా అర్థమయ్యేలా చెప్పడం కోసం ఆ సంభాషణలను ట్రైలర్ లో అలాగే ఉంచడం జరిగింది. సినిమాలో మాత్రం ఆ రెండు అభ్యంతరకర పదాలు వినిపించవు.

గతేడాది మే 8 మొదలై, ఈ ఏడాది మే 8 తో సినిమా పూర్తయింది. సినిమా పూర్తవ్వడానికి సరిగ్గా ఏడాది పట్టింది. ఇందులో షూటింగ్ చేసినవి 103 రోజులు.

Exit mobile version