ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

మెగా హీరోకి కథలు నచ్చట్లేదా..?

మెగా ఫ్యామిలీ నుంచి చివరగా వచ్చి తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న హీరో వైష్ణవ్ తేజ్. బుచ్చి బాబు డైరెక్షన్లో ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీతోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఉప్పెన హిట్ తో వైష్ణవ్ సినిమాల మీద బజ్ పెరిగింది. ఐతే ఆ తర్వాత మాత్రం వైష్ణవ్ తేజ్ కి అలాంటి హిట్ పడలేదు. ఉప్పెన తర్వాత చేసిన 3 సినిమాలు కూడా ఒక దాన్ని మించి మరొకటి అనే రేంజ్ లో డిజాస్టర్లు అయ్యాయి.

మొదటి సినిమా విషయంలో కథ పరంగా ప్రొడక్షన్ పరంగా పర్ఫెక్ట్ గా కాలిక్యులేషన్స్ వేసుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత సినిమాలకు మాత్రం అవేవి లేకుండా చేసి కెరీర్ రిస్క్ లో పడేసుకున్నాడు. చివరగా వైష్ణవ్ తేజ్ చేసిన ఆదికేశవ సినిమా సితార బ్యానర్ నిర్మించినా సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కథగా విన్నప్పుడు బాగున్న ప్రతిది సినిమాగా తెరకెక్కినప్పుడు బాగుంటుందని చెప్పడం కష్టం. అందుకే స్టోరీ సెలక్షన్ మీద పూర్తి అవగాహన ఉండాలని అంటారు.

ఇదిలా ఉంటే ఆదికేశవ ఫ్లాప్ తర్వాత వైష్ణవ్ తేజ్ కెరీర్ డైలమాలో పడింది. ఉప్పెన తర్వాత చేసిన సినిమాలన్నీ వర్క్ అవుట్ అవ్వకపోవడం వల్ల హీరో మార్కెట్ కూడా దారుణంగా పడిపోయింది. ఈ టైం లో ఒక సూపర్ హిట్ కథ కోసం వైష్ణవ్ తేజ్ వెతుకుతున్నాడని తెలుస్తుంది.

అందుకే తన దగ్గరకు వచ్చి కథ చెబుతున్న రైటర్స్, డైరెక్టర్స్ అందరికీ ఏమాత్రం డౌట్ అనిపించినా నో అని చెప్పేస్తున్నాడట. ఆదికేశవ తర్వాత వారానికి ఐదారు కథల దాకా వింటున్నాడట వైష్ణవ్ తేజ్. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా తనకు నచ్చలేదని టాక్. మళ్లీ ఉప్పెన లాంటి హిట్ పడితే తప్ప వైష్ణవ్ తేజ్ కెరీర్ ట్రాక్ లోకి వచ్చే అవకాశం లేదు. మరి మెగా మేనల్లుడు నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి. మేనల్లుడు తొలి సినిమాకు మెగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ అందించగా ఉప్పెన తర్వాత స్టోరీ సెలక్షన్ లో సొంత నిర్ణయాల వల్లే వైష్ణవ్ తేజ్ కెరీర్ ఇలా ఉందని చెప్పొచ్చు. మళ్లీ మెగా సపోర్ట్ అందిస్తేనే వైష్ణవ్ తేజ్ కెరీర్ సెట్ రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Exit mobile version