ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

యాక్టర్ కృష్ణుడు.. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా..

ఒకప్పుడు కొంతమంది సైడ్ యాక్టర్స్ చేసింది చిన్న పాత్రలే అయినా ప్రేక్షకుల్లో మాత్రం సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఆ విధంగా ఓవర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారిలో కృష్ణుడు కూడా ఉన్నాడు. అతను చాలాకాలంగా సినిమా ఇండస్ట్రీకి అయితే కొంత దూరంగానే ఉంటున్నాడు. అవకాశాలు లేకో మరేఇతర కారణాల వల్లనో కానీ కృష్ణుడు అయితే వెండి తెరకు గతంలో మాదిరిగా అయితే ఎక్కువ స్థాయిలో కనిపించడం లేదు.ఇక మళ్ళీ ఇన్నాళ్లకు అతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే అతని కూతురు హాఫ్ శారీ ఫంక్షన్ కు సంబంధించిన ఫోటోలతో కృష్ణుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అతని అసలు పేరు అల్లూరి కృష్ణంరాజు తూర్పుగోదావరి రాజోలు చింతపల్లికి చెందిన కృష్ణుడు మొదటగా గంగోత్రి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

ఇక తర్వాత కొన్ని సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. ముఖ్యంగా హ్యాపీడేస్ సినిమాతో కూడా అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక మధ్యలో అయితే కృష్ణుడు హీరోగా కూడా అడుగులు వేశాడు. పప్పు విలేజ్ లో వినాయకుడు వంటి సినిమాలు ఓవర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

అలాగే చందమామ కథలు సినిమాలో కూడా అతను చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. అంతకుముందు పొకోరి మధుమాసం ఓయ్ వంటి సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ చేశాడు.

అయితే హీరోగా ట్రై చేసిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన కృష్ణుడు ఇప్పుడు మాత్రం పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు. ప్రస్తుతం అయితే అతను వ్యాపారం చేసుకుంటూ స్థిరపడినట్లుగా తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత తన కూతురు హాఫ్ సారి ఫంక్షన్ ద్వారా మళ్ళీ వార్తల్లో నిలిచాడు.

ఇటీవల దస్ పల్లా హోటల్లో జరిగిన ఆ వేడుకను ఘనంగా నిర్వహించిన కృష్ణుడు పలు రాజకీయ నాయకులను సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మరి కృష్ణుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో చూడాలి.

Exit mobile version