ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

రెహమాన్ కెరీర్‌ లో ఫస్ట్‌ టైమ్‌.. చరణ్ కోసం!

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ తో వర్క్ చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ప్రతి హీరో కూడా తాను నటించే ఒక్క సినిమా కు అయినా రెహమాన్ సంగీతాన్ని అందిస్తే బాగుండు అనుకుంటారు. రెహమాన్‌ పారితోషికం భారీగా డిమాండ్‌ చేస్తాడు. ఆ మొత్తం ఇచ్చిన కూడా ఆయన డేట్లు దొరకడం చాలా కష్టం.

రెహమాన్ తో సినిమా పెట్టుకున్న వారు చాలా మంది ఆయన సమయానికి పాటలు ఇవ్వక పోవడం లేదా ఆర్‌ఆర్‌ కంప్లీట్‌ చేయక పోవడం వంటి కారణాల వల్ల నెలల తరబడి సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అందుకే త్వరగా రిలీజ్ అవ్వాలి అనుకున్న వారు రెహమాన్‌ తో వెళ్లేందుకు కాస్త ఆలోచిస్తారు అనేది ఇండస్ట్రీ టాక్‌.

రామ్ చరణ్‌, బుచ్చి బాబు కాంబోలో రూపొందబోతున్న సినిమాకు రెహమాన్ ను సంగీత దర్శకుడు అనగానే చాలామంది అయ్యో ఎప్పటికి ఈ సినిమా అయ్యేను అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రామ్ చరణ్‌ సినిమా కోసం రెహమాన్ అప్పుడే మూడు పాటలు రికార్డ్‌ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇప్పటి వరకు బుచ్చి బాబు కనీసం ఒక్క సన్నివేశం షూటింగ్‌ చేయలేదు. అయినా కూడా రెహమాన్‌ వద్ద నుంచి మూడు పాటలు తీసుకున్నాడని సమాచారం అందుతోంది. రెహమాన్ కెరీర్‌ లో ఒక సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వకుండా మూడు పాటలను ఇవ్వడం ఇదే ప్రథమం అయ్యి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఏది ఏమైనా రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సినిమాకు రెహమాన్ సంగీతం ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం. అదే సమయంలో రెహమాన్ సంగీతం వల్ల సినిమా ఆలస్యం అవ్వకపోవచ్చు అని కూడా చర్చ మొదలైంది. గేమ్‌ చేంజర్ సినిమా కోసం చాలా సమయం కేటాయించిన చరణ్‌, తదుపరి సినిమా విషయంలో ఆలస్యం అవ్వకూడదు అని భావిస్తున్నాడట.

అందుకే రెహమాన్‌ వైపు నుంచి ఆలస్యం అవ్వకుండా ఇప్పటికే పాటల రికార్డింగ్‌ మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. జూన్‌ నెలలో గేమ్‌ చేంజర్ సినిమా షూటింగ్‌ ను శంకర్ పూర్తి చేయబోతున్నాడు. ఆ వెంటనే బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్‌ కొత్త సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు.

బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తో రూపొందబోతున్న సినిమాలో రామ్‌ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Exit mobile version