ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

శృతి హాసన్ సబ్బులు తయారుచేస్తోంది

కరోనా దెబ్బకు సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారైతే క్వారంటైన్‌లో గడుపుతున్నారు. లండన్ నుంచి వచ్చిన శృతి హాసన్ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లోనే ఎంజాయ్ చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘వకీల్ సాబ్‌’ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైన ఈ అమ్మడు, ఈ సమయానికి ఆ షూటింగ్‌లో బిజీగా ఉండాల్సింది. అయితే పరిస్థితులు మారిపోవడంతో ఇంట్లో ఒంటరిగా గడుపుతూ తనను తాను తెలుసుకుంటోందంట. ఇప్పటికే క్వారంటైన్‌లో 10 రోజులు పూర్తి చేసుకున్న శృతి హాసన్… ఈ టైమ్‌లో స్వయంగా ఆర్గానిక్ సబ్బులు తయారుచేసిందట.

‘నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. ఒక్కదాన్ని ఉన్నా ఆర్గానిక్ సోప్స్ చేస్తూ కాసేపు, వంట చేస్తూ కాసేపు గడిపేస్తున్నా… కొన్ని బేకింగ్ ఐటెమ్స్ కూడా ట్రై చేశా… ’ అంటూ చెప్పిన శృతి, పని మనిషిని మాన్పించేసి, అన్ని పనులు తానే స్వయంగా చేసుకుంటోందట. క్వారంటైన్‌ను శ్రద్ధగా పాటిస్తున్న శృతి హాసన్‌, తనలా అందరూ ఇంట్లో ఉంటూ సురక్షితంగా ఉండాలంటూ పిలుపునిస్తోంది. లాక్ డౌన్ సమయంలో ఊరికే ఇంట్లో ఉండడం బోర్ అనుకునేవాళ్లు, ఎంచక్కా శృతి హాసన్‌ను ఫాలో అయిపోండి.

Exit mobile version