ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

సినిమా కాదు సీరీస్ కే ఓటు వేస్తున్న వెంకీ మామ..!

సైంధవ్ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ సినిమా అనిల్ రావిపుడి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. F2, F3 సినిమాల తర్వాత మరోసారి వెంకటేష్ అనీల్ రావిపుడి కలిసి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడమే లేటు అని అనుకుంటుంటే వెంకటేష్ మాత్రం ఈ సినిమాను వెనక్కి నెట్టి వెబ్ సీరీస్ ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తుంది.

వెంకటేష్ కెరీర్ లో ఫస్ట్ టైం చేసిన వెబ్ సీరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ సీరీస్ వెంకీ మామ ఫ్యాన్స్ ని అలరించలేదు కానీ నార్త్ సైడ్ ఆడియన్స్ మాత్రం సూపర్ హిట్ చేశారు. రానా, వెంకటేష్ కలిసి చేసిన ఈ వెబ్ సీరీస్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ ఈ సీరీస్ సెకండ్ సీజన్ ను సిద్ధం చేస్తుంది. అసలైతే లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే ఈ సీరీస్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉన్నా కుదరలేదు.

వెంకటేష్ రానా నాయుడు 2 పూర్తి చేసిన తర్వాతే అనిల్ రావిపుడి సినిమా చేస్తానని అంటున్నాడట. రానా నాయుడు 2 కోసం వెంకటేష్ జూన్, జూలైలో డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ టైం లో సీరీస్ లో తన పోర్షన్ ను పూర్తి చేసి ఆఫ్టర్ జూలై అనీల్ రావిపుడి సినిమా షూటింగ్ లో పాల్గొంటారట వెంకటేష్. అందుకే జూన్ లో సెట్స్ మీదకు వెళ్తుంది అనుకున్న వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమా ఆగష్టు, సెప్టెంబర్ దాకా వెళ్తుందని తెలుస్తుంది.

F2, F3 రెండు ఫన్ అండ్ ఎంటర్టైనర్ సినిమాలతో వచ్చిన అనీల్ రావిపుడి ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా కొంత ఎమోషన్ ని కూడా టచ్ చేస్తున్నాడని తెలుస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎమోషనల్ మూవీగా వెంకటేష్ 76వ సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మిగతా కాస్టింగ్ డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. అనీల్ రావిపుడితో ఎలాగు రెండు హిట్లు కొట్టిన ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి వెంకటేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

Exit mobile version