Advertisement

సీతారామం – కార్తికేయ టీవీలో హిట్.. చైతూ డిజాస్టర్!

Posted : December 1, 2022 at 8:12 pm IST by ManaTeluguMovies

అక్టోబర్ నెల టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చాలా బాగా కలిసి వచ్చింది అని చెప్పాలి. ఆ నెలలో వచ్చిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి నిర్మాతలకు బయ్యర్లకు అందరికి కూడా మంచి ప్రాఫిట్స్ అందించాయి. అంతేకాకుండా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సంఖ్య కూడా మరింత పెరిగింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎలాంటి సినిమా అయినా చూస్తారు అని ఆ సినిమాలు చాలా బాగా రుజువు చేశాయి.

అయితే అదే సినిమాలు ఓటీటీ లో కూడా మంచి స్పందనను అందుకున్నాయి. ఇక శాటిలైట్ పరంగా టీవీలలో ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయి అనే వివరాల్లోకి వెళితే. ఇటీవల సీతారామం సినిమా స్టార్ మా లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమా రేంజ్ కు తగ్గట్టుగా మంచి రేటింగ్స్ అయితే అందుకుంది. మొదటిసారి టెలికాస్ట్ చేయగా 8.73 టీఆర్పీ అందుకోవడం విశేషం. ఒక విధంగా ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ టైం టిఆర్పి కంటే ఇది ఎక్కువే.

ఇక నీకు నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ 2 సినిమా థియేటర్లలో భారీ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. హిందీలో కూడా సక్సెస్ అయిన ఈ సినిమా ఓటీటీ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక కార్తికేయ 2 జీ తెలుగులో మొదటిసారి టెలికాస్ట్ అయింది. మొదటిసారి కార్తికేయ 2 సినిమా 7.88 డిఆర్పి అందుకుంది.

ఒక విధంగా నిఖిల్ కెరీర్ లో ఇది బెస్ట్ టిఆర్పి అని చెప్పవచ్చు. ఇక నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది.

పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం లాభాలు అందించలేదు. అయితే ఇటీవల జెమినీ టీవీలో మొదటిసారి టెలి క్యాస్ట్ చేయగా ఫస్ట్ టైం 3.41 టిఆర్పి మాత్రమే వచ్చింది. ఈ విధంగా బిగ్ స్క్రీన్ పై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.


Advertisement

Recent Random Post:

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Posted : April 22, 2024 at 10:19 pm IST by ManaTeluguMovies

Aa Okkati Adakku – Official Trailer | Allari Naresh | Faria | Malli | Gopi Sundar | Rajiv Chilaka

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement