ప్రస్తుతం సమంత కెరీర్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతం ఈమెకు కమర్షియల్ పాత్రలు ఇచ్చేందుకు ఏ దర్శకుడు కాని ఏ హీరో కాని ఆసక్తిగా లేడు. తెలుగు హీరో నాగచైతన్య ఈమెను వివాహం చేసుకున్నాడు కనుక తెలుగు హీరోలు ఎవరు కూడా ఈమెతో రొమాన్స్ చేసేందుకు కాని.. దర్శకులు ఈమెను కాస్త హాట్‌గా చూపించేందుకు గాని ఆసక్తి చూపడం లేదు. అక్కినేని ఫ్యాన్స్‌కు భయపడి కాస్త సమంతకు దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది.
ఇక ఈమె తమిళంలో అయినా కమర్షియల్ సినిమాలను ట్రై చేయాలనుకుంటే అక్కడ కూడా పరిస్థితి ఇలాగే ఉందట. దాంతో సమంత కమర్షియల్ సినిమాలు ఇక చేయక పోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. సమంత చేస్తే వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు లేదంటే మరో రకం పాత్రలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అక్కినేని ఫ్యామిలీ కోడలు అయిన కారణంగా సమంతను ఎవరు కూడా అలా చూడాలని కూడా కోరుకోవడం లేదు. కనుక సమంత హాయిగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కాస్త చూసి జాగ్రత్తగా ఎంచుకోవడం మంచిది అంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కమర్షియల్ సినిమాలకు సమంత దూరం అయినట్లే అని ఇకపై కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలకు మాత్రమే ఈమె పరిమితం అంటున్నారు.