Advertisement

స్పెషల్: మరోసారి మెగాహీరోతో ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ

Posted : March 10, 2020 at 12:16 pm IST by ManaTeluguMovies

చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ. మే 1న సోలో బ్రతుకే సో బెటర్ ని రిలీజ్ చేయడం కోసం గ్యాప్ లేకుండా తేజ్ షూటింగ్ చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సాయి తేజ్ కమర్షియల్ కథలకి స్ట్రాంగ్ ఫిలాసఫీని కలిపి చెప్పే విభిన్న చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో సాయి తేజ్ సినిమా చేయనున్నట్టు ఇది వరకే తెలిపాం. ఈ సినిమాలో సాయి తేజ్ తో రొమాన్స్ చేయడానికి నివేత పేతురాజ్ ని ఖరారు చేసింది టీం. నివేత పేతురాజ్ సాయి తేజ్ తో కలిసి ‘చిత్రలహరి’లో కూడా నటించింది. వీరిద్దరి కలయికలో ఇది రెండవ సినిమా.

ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన సాయి తేజ్ మళ్ళీ ఈ సినిమాతో యాక్షన్ జోన్ లోకి వెళ్లనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. జె భగవాన్ – పుల్లారావులు ఈ సినిమాని నిర్మించనున్నారు.


Advertisement

Recent Random Post:
Advertisement