ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

హీరోయిన్లకు పట్టని కరోనా

ముంబాయిలో ఆల్బమ్ లు పట్టుకుని తిరిగేవారికి టాలీవుడ్ అన్నది బంగారు బాతుగుడ్డు. కాస్త తెల్లగా అందంగా వుంటే చాలు తెలుగులో అవకాశం వస్తుంది. కాస్త ప్రతిభ చూపించి, ఫరవాలేదు అనుకుంటే చాలు అవకాశాలు వెల్లు వెత్తుతాయి. అయిదు పది లక్షలతో ప్రారంభమై కోటి నుంచి కోటిన్నర తీసుకునే రేంజ్ కు వెళ్తారు. అది వారి ప్రతిభ, వారి అదృష్టం అనుకుందాం.

కానీ సమస్య వచ్చినపుడు సాయం చేయడానికి ముందుకు రావాలి కదా? లావణ్య త్రిపాఠీ లాంటి పెద్దగా అవకాశాల్లేని హీరోయిన్ మినహా మరే హీరోయిన్ ముందుకు రాలేదు. కరోనా విషయంలో ప్రభుత్వం ద్వారా లేదా సిసిసి ద్వారా సహాయం అందించడానికి. తెలుగు ఇంట మెట్టిన సమంత కావచ్చు, తెలుగునాట పాపులర్ అయిన అనుష్క, రష్మిక, పూజా హెగ్డే, రకుల్ ఇలా ఎవ్వరూ ఓ రూపాయి విరాళం కూడా ప్రకటించలేదు.

అసలు కనీసం ఓ ప్రకటన లేదు, ఓ విడియో లేదు. మిగతా సెలబ్రిటీలు చేస్తున్నట్లు కనీసం ఫ్రీ ఫ్రీ ఫ్రీ ప్రవచనాలు కూడా లేవు. హ్యాపీగా సెలవులు ఎంజాయ్ చేస్తున్నట్లు వుండిపోయారు.

ఇదిలా వుంటే మన టాలీవుడ్ వాళ్లు కోరి తెచ్చుకునే పరభాషా నటులు అనేక మంది వున్నారు. వీరు కూడా స్పందించిన పాపాన పోలేదు. ఇక్కడ వాళ్ల కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చి మరీ తెచ్చుకుంటారు. వాళ్లు ఇలాంటి టైమ్ లో మాత్రం మొహంచాటేస్తారు.

Exit mobile version