Advertisement

1000 కోట్ల ద‌ర్శ‌కుడిని బ‌న్ని కాద‌న‌డానికి కార‌ణం?

Posted : June 21, 2024 at 10:27 pm IST by ManaTeluguMovies

1000 కోట్ల వ‌సూళ్ల‌తో సంచ‌ల‌నం సృష్టించిన సినిమాని తెర‌కెక్కించాడు అట్లీ. కింగ్ ఖాన్ షారూఖ్ కి కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని అందించాడు. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కించినా కానీ, అట్లీ బ్లాక్ బ‌స్ట‌ర్ అందించ‌డంతో ఆ త‌ర్వాత అత‌డి పేరు మార్మోగిపోయింది. అదే స‌మ‌యంలో అట్లీ త‌దుప‌రి చిత్రం ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ తో ఉంటుంద‌ని ప్ర‌చారం సాగింది.

అప్ప‌టికే అట్లీతో బ‌న్ని స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ ప‌లుమార్లు క‌థా చ‌ర్చ‌లు సాగించారు. కానీ ఏమైందో ఇంత‌లోనే ఈ కాంబినేష‌న్ కొన‌సాగ‌దు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. అట్లీ ఏకంగా 80 కోట్ల పారితోషికం డిమాండ్ చేయ‌డంతో గీతా ఆర్ట్స్ వ‌ద్ద‌నుకుంద‌ని విస్త్ర‌తంగా ప్ర‌చార‌మైంది. కానీ ఇదొక్క‌టే కార‌ణమా? లేక ఇంకేదైనా రీజ‌న్ ఉందా? అంటూ ఆరాలు కొన‌సాగుతున్నాయి.

అయితే ఈ కాంబినేష‌న్ సెట్ట‌వ్వ‌క‌పోవ‌డానికి మ‌రో కొత్త కార‌ణం వినిపిస్తోంది. నిజానికి అట్లీ రాసుకున్న క‌థ బ‌న్నీకి సెట్ట‌వ్వ‌లేద‌ని తెలుస్తోంది. ఇందులో ఇద్ద‌రు ప్ర‌ధాన హీరోలు ఉంటారు. బ‌న్నీతో పాటు ఇంచుమించి స‌మ ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లో వేరొక హీరో న‌టించాల్సి ఉంటుంది. ఎవ‌రైనా బాలీవుడ్ స్టార్ ని దీనికోసం ఎంపిక చేయ‌డం ద్వారా హిందీ మార్కెట్ ని కూడా కొల్ల‌గొట్టాల‌ని అట్లీ తెలివిగా ఈ క‌థ‌ను రాసుకున్నాడు. కానీ బ‌న్నీ దీనిని కాద‌నుకున్నాడు.

బ‌న్ని ఇద్ద‌రు హీరోల స్క్రిప్ట్ ని వ‌ద్ద‌నుకోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ ల‌ను డైరెక్ట్ చేసిన రాజ‌మౌళి ఆ ఇద్ద‌రి పాత్ర‌ల్ని బ్యాలెన్స్ చేయ‌డంలో వంద‌శాతం స‌ఫ‌లం కాలేద‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగింది. తార‌క్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేసార‌ని కూడా గుస‌గుస వినిపించింది. అందుకే అలాంటి త‌ప్పిదం జ‌ర‌గ‌కుండా బ‌న్ని ముందే జాగ్ర‌త్త తీసుకున్నాడ‌ని ..ఎవ‌రైనా బాలీవుడ్ హీరోతో క‌లిసి న‌టించేందుకు త‌న‌కు అభ్యంత‌రం లేక‌పోయినా కానీ, ఇద్ద‌రు హీరోల స్క్రిప్టు వ‌ల్ల‌ ఏదైనా తేడా కొడితే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని బ‌న్ని భావించాడ‌ట‌. అదే గాక అట్లీ జ‌వాన్ లాంటి మ‌రో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్టునే వినిపించ‌డం కూడా వైదొల‌గ‌డానికి కార‌ణం అయ్యుండొచ్చ‌న్న ఊహాగానాలు లేక‌పోలేదు.

బ‌న్ని ఇద్ద‌రు హీరోల స్క్రిప్ట్ ని వ‌ద్ద‌నుకోవ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ ల‌ను డైరెక్ట్ చేసిన రాజ‌మౌళి ఆ ఇద్ద‌రి పాత్ర‌ల్ని బ్యాలెన్స్ చేయ‌డంలో వంద‌శాతం స‌ఫ‌లం కాలేద‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగింది. తార‌క్ ఫ్యాన్స్ కొంత అసంతృప్తిని వ్య‌క్తం చేసార‌ని కూడా గుస‌గుస వినిపించింది. అందుకే అలాంటి త‌ప్పిదం జ‌ర‌గ‌కుండా బ‌న్ని ముందే జాగ్ర‌త్త తీసుకున్నాడ‌ని ..ఎవ‌రైనా బాలీవుడ్ హీరోతో క‌లిసి న‌టించేందుకు త‌న‌కు అభ్యంత‌రం లేక‌పోయినా కానీ, ఇద్ద‌రు హీరోల స్క్రిప్టు వ‌ల్ల‌ ఏదైనా తేడా కొడితే ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని బ‌న్ని భావించాడ‌ట‌. అదే గాక అట్లీ జ‌వాన్ లాంటి మ‌రో రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ స్క్రిప్టునే వినిపించ‌డం కూడా వైదొల‌గ‌డానికి కార‌ణం అయ్యుండొచ్చ‌న్న ఊహాగానాలు లేక‌పోలేదు. ఇక అట్లీ ఇదే స్క్రిప్టుతో స‌ల్మాన్ ఖాన్ ని సంప్ర‌దించి ఒప్పించాడు. ఇందులో మ‌రో హీరోగా సౌత్ హీరో కోసం సెర్చ్ చేస్తున్నాడ‌ని కూడా టాక్ ఉంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.


Advertisement

Recent Random Post:

Nizamabad : టార్చర్‌ భరించలేక యువజంట ఆత్మహ**త్య

Posted : July 17, 2024 at 11:37 am IST by ManaTeluguMovies

Nizamabad : టార్చర్‌ భరించలేక యువజంట ఆత్మహ**త్య

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement