ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

1000 కోట్లు.. అంత విలువైన సీక్వెల్ ను పట్టించుకోరేంటి?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఐదుగురు దర్శకులు ఉన్నారు. ఇక ఈ ఏడాది డార్లింగ్ కల్కి 2898ఏడీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 1150+ కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికంటే ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గత ఏడాది సలార్ సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా 700 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది.

సలార్ కి సీక్వెల్ గా శౌర్యంగ పర్వం టైటిల్ తో మూవీ వస్తుందని ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశారు. సలార్ పార్ట్ 1లో ఇంకా పూర్తి స్టోరీ చెప్పకుండా వదిలేశారు. దీంతో సలార్ 2 రాక కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2025 ఆరంభంలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఎందుకనో కార్య రూపం దాల్చలేదు.

కనీసం ఈ ఏడాది ద్వితీయార్ధంలో అయిన మొదలు పెడతారని అనుకుంటే సడెన్ గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాని స్టార్ట్ చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. 2026 జనవరి 9కి రిలీజ్ చేస్తామని ముందే క్లారిటి ఇచ్చారు. దీంతో సలార్ 2 పరిస్థితి ఏంటనే ప్రశ్న ఫ్యాన్స్ నుంచి వస్తోంది.

సలార్ 2 1000 కోట్ల బిజినెస్ చేయగల కంటెంట్. అలాంటి దానిపై కనీసం క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. అటు నిర్మాత, ఇటు దర్శకుడి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. సలార్ మూవీలో నటించిన బాబీ సింహ అయితే ఓ ఇంటర్వ్యూలో పార్ట్ 2 త్వరలో స్టార్ట్ అవుతుందని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి సౌండ్ లేదు. ఇటు ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఈ నెల 17న హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీని ప్రారంభించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాదిలోనే మొదలు కాబోతోందంట. వీటిని కంప్లీట్ చేయడానికి కనీసం రెండేళ్లు పట్టొచ్చు. ఇవి కాకుండా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి పార్ట్ 2 సినిమాని కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి చేస్తేగాని సలార్ 2ని మళ్ళీ స్టార్ట్ చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

సలార్ లో చేస్తోన్న దేవ క్యారెక్టర్ కి కంప్లీట్ డిఫరెంట్ లుక్స్ లో ప్రభాస్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలలో కనిపిస్తున్నాడు. కేవలం లుక్ కారణంగానే సలార్ 2 ఆలస్యం అవుతుందా లేదంటే వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనేది ప్రశాంత్ నీల్ అధికారికంగా రెస్పాండ్ అయ్యేంత వరకు తెలియదు.

Exit mobile version