ఆధ్యాత్మిక బోధకురాలు లేదా ఆధ్యాత్మిక సేవికులు అంటే వారికి పబ్లిక్ లో ఉండే ఇమేజ్ వేరు. గురువులు, స్వామీజీలు, మాతాజీలు అంటే సింప్లిసిటీకి నిదర్శనం. వారు భక్తులను విలాసవంతమైన జీవితం గడపాలని నిర్ధేశించరు. సాధారణ జీవన విధానాన్ని మాత్రమే బోధిస్తారు. కానీ అందుకు భిన్నంగా కనిపించారంటూ ప్రముఖ ఆధ్యాత్మిక బోధకురాలిపై నెటిజనులు విరుచుకుపడుతున్నారు.
పాపులర్ ఆధ్యాత్మిక బోధకురాలు, గాయని అయిన జయ కిషోరి రూ. 2 లక్షల ఖరీదైన డియోర్ బ్రాండ్ బ్యాగ్ తో కనిపించడంపై ఇప్పుడు ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. జయ కిషోరి తన అనుచరులకు భౌతికవాదం, నిర్లిప్తత గురించి బోధిస్తూ రూ.2 లక్షలకు పైగా విలువైన డియోర్ బ్యాగ్‌ని భుజానికి తగిలించడంతో తీవ్ర విమర్శలకు గురయ్యారు. 29 ఏళ్ల హిందూ బోధకురాలు ఇటీవల విమానాశ్రయంలో కస్టమైజ్డ్ డియోర్ బ్రాండ్ బ్యాగ్‌తో కనిపించారు.
అసలు ఈ బ్రాండ్ ఖరీదు ఎలా ఉంది? అని ప్రజలు డియోర్ వెబ్ సైట్‌ను శోధించారు. కిషోరితో ఉన్న ఈ `డియోర్ బుక్ టోట్` పత్తితో రూపొందించినది…. కాటన్ తో రూపొందించనది. అయితే తనపై విమర్శలు రావడంతో ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరి డియోర్ బ్యాగ్‌తో ఉన్న తన వీడియోను తొలగించారు.
కోల్‌కతాలో 13 జూలై 1995న జన్మించిన జయ కిషోరి చిన్న వయస్సులోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపడం ప్రారంభించానని తెలిపారు. ఆమె నేడు ఆధ్యాత్మిక వక్తగా, గాయనిగా, మతతత్వం- సరళమైన జీవనాన్ని బోధించే ప్రేరణాత్మక వ్యక్తిగా పాపులరయ్యారు.