మిల్కీబ్యూటీ తమన్నా- విజయ్ వర్మ రిలేషన్ షిప్ గురించి ప్రపంచానికి తెలిసిందే. ఇద్దరు కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నారు. తమన్నాని విజయ్ ఎంతగా ఇష్టపడుతున్నాడు? అన్నది ఎన్నో సందర్భాల్లో బయట పెట్టాడు. తమన్నా సైతం అంతే ప్రేమను చూపించింది. కానీ పెళ్లి ఎప్పుడు అంటే మాత్రం సరైన క్లారిటీ రావడం లేదు. ఇద్దరి మధ్య బాండింగ్ పీక్స్ కి చేరినా పెళ్లి తేదీ బయటకు రావడం లేదనే చర్చ చాలా కాలంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ రెడీగా ఉన్నా? తమన్నా మాత్రం ఇప్పట్లో సిద్దంగా లేదని ఆమె వ్యాఖ్యల్ని బట్టి అర్దమైంది. కెరీర్ పైనే దృష్టి పెట్టానని, పెళ్లి గురించి ఇంకా ఆలోచన చేయలేదు అన్నట్లు గా చెప్పుకొ చ్చింది. అయితే నెట్టింట మాత్రం త్వరలో పెళ్లి జరుగుతుందని తేదీ ఇదని? వేదిక ఫలానా చోట అంటూ ప్రచారం సాగింది.
అయితే ఈ ప్రచారంపై తమన్నా కాస్తంత అసంతృప్తిని వ్యక్తం చేసింది. మాకే తెలియకుండా పెళ్లి అన్నట్లు? అసహనం వ్యక్తం చేసింది. అయితే ఈ పెళ్లి తంతుకు 2025 లో ఓ పుల్ స్టాప్ పడిపోతుందని విజయ్ వర్మ మాటల్ని బట్టి తెలుస్తోంది. వచ్చే ఏడాది పెళ్లి గురించి పరిశీలిస్తామని అంతవరకూ ఎలాంటి ఆలోచన లేదనే విషయాన్ని తెలిపాడు.
మొత్తానికి పెళ్లి ప్రచారానికి 2025 ఓ ముగింపు ..ఓ కొలిక్కి వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరికి సంబంధించిన 5000 ప్రయివేట్ ఫోటోలు ఉన్నాయని విజయ్ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పిక్స్ కేవలం తమ ఇద్దరి మధ్యనే ఉన్నాయని, బయటకు రాలేదని..అవెంతో ప్రత్యేకంగా తమ బంధానికి గుర్తుగా హైడ్ చేసినట్లు తెలిపాడు.