ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

3 కోట్ల సినిమాకి 70 కోట్లు వ‌సూళ్లు

మ‌ల‌యాళం కంటెంట్ పాన్ ఇండియాలో ఎంత సంచ‌ల‌న‌మ‌వుతుందో తెలిసిందే. కంటెంట్ బేస్డ్ చిత్రా ల‌కు ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌రధం ప‌డుతున్నారు. భాష‌తో సంబంధం లేకుండా..స్టార్ ఇమేజ్ అనే ముద్ర లేకుండా ఆద‌రిస్తున్నారు. త‌క్కువ బ‌డ్జెట్ లో సినిమా చేసి వంద‌ల కోట్టు ఎలా కొల్ల‌గొట్ట వ‌చ్చు అక్క‌డ నుంచి నేర్చుకుంటే స‌రి అనిపించేలా వాళ్ల కంటెంట్ క‌నిపిస్తుంది.

‘ది కేర‌ళ స్టోరీ’ లాంటి చిన్న సినిమా పాన్ ఇండియాలో ఎంత పెద్ద స‌క్సెస్ సాధించిందో తెలిసిందే. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఇత‌ర భాష‌ల నుంచి మ‌ల‌యాళం కంటెంట్ కి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. తాజాగా మ‌రో మాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ రికార్డు దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్పుడు అంద‌రి నోట ఆ మాట సినిమా గురించే.. అదే ‘ప్రేమలు’ అనే చిత్రం. ఈ నెల 9వ తేదీన మలయాళంలో ఈ సినిమా విడుదలైంది.

తొలి షోతోనే సినిమాకి మంచి టాక్ వ‌చ్చింది. అక్క‌డి ప్రేక్ష‌కులు ఇది పాన్ ఇండియా కంటెంట్ ఉన్న సినిమా అంటూ పెద్ద ఎత్తున స్వ‌చ్ఛందంగా ప్రమోట్ చేసారు. దీంతో అదే చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 15వ తేదీన రిలీజ్ చేశారు. ఇప్పుడు అన్ని చోట్లా సినిమాకి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా 70 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఇంత‌కీ ఈసినిమా బ‌డ్జెట్ ఎంతో తెలుసా? కేవ‌లం 3 కోట్లు మాత్రమే.

అతి త‌క్కువ బ‌డ్జెట్ లో తెర‌కెక్కించి ఈ రేంజ్ వ‌సూళ్లు సాధించిన తొలి మ‌ల‌యాళ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా వ‌సూళ్లు ఇంకా భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తోంది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగడం విశేషం.

ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు కూడా రాబోతుంది. ఈ సినిమా తెలుగు హక్కులను ఎస్.ఎస్. కార్తికేయ సొంతం చేసుకున్నారు. మార్చి 8న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని స‌న్నాహా లు చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ దక్కిం చుకున్నట్టుగా సమాచారం. గిరీశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నస్లేన్ .. మమిత .. అల్తాఫ్ సలీమ్ .. మీనాక్షి రవీంద్రన్ .. అఖిల భార్గవ్ ప్రధానమైన పాత్రలను పోషించారు.

Exit mobile version