Advertisement

40ఏళ్లు వెనక్కి రాజ్​ తరుణ్.. ​ఈ సారైనా మ్యాజిక్ చేస్తారా

Posted : September 9, 2023 at 10:14 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ యంగ్​ హీరో రాజ్ తరుణ్.. ఒకప్పుడు టాలీవుడ్​కు ఉవ్వెత్తున దూసుకొచ్చిన యువ కెర‌టం. ‘ఉయ్యాల జంపాల‌’తో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో.. ‘సినిమా చూపిస్తా మావ‌’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్న నేను నా బాయ్ ప్రెండ్’, ‘కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త’ లాంటి చిత్రాలతో తన సక్సెస్​ను కొనసాగించారు. అయితే ఇప్పుడాయన.. మొదట్లో అందుకున్న విజయాలను ఇప్పుడు అందుకోలేక సతమతమవుతున్నారు.

మొదట్లో తాను అందుకున్న రేంజ్​ సకెస్స్​ను ముద్దాడానికి ఎంతో కాలంగా తెగ కష్టపడుతున్నారు. ఒక్క హిట్టై కొట్టి మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడాయన నుంచి రెండు కొత్త చిత్రాలు రాబోతున్నాయి. వాటిలో ‘మాస్ మహారాజు’ ఒకటి. మరో హీరో ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్​ సందీప్‌మాధవ్‌ కలిసి ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో చాలా కాలం క్రితమే అనౌన్స్​ చేశారు. కానీ అనుకోని కారణాలు వల్ల ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. భిన్న కాన్సెప్ట్​తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యుల్​కు చేరుకుంది. ప్రస్తుతం ఈ షెడ్యూల్​ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్​పై నిర్మాత స్వాతి రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి.హెచ్.సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. గదర్ 2 హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, సంపద హీరోయిన్స్​గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో రాజా రవీంద్ర, రవి శంకర్, షఫీ, శివరామరాజు వెంకట్, సత్యం రాజేష్, ధనరాజ్, రచ్చ రవి, ఐశ్వర్య ఇతరులు నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ డిఫరెంట్ లుక్స్​లో కనిపించబోతున్నారట. 1980 బ్యాక్ డ్రాప్​లో సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో యాక్షన్​తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్రబృంంద చెబుతోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

ఇక ఈ చిత్రంతో పాటు రాజ్​ తరుణ్​.. ‘తిరగబడరా సామి’ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. రాజ్​తరుణ్​తో పాటు మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటించారు. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించారు. రీసెంట్​గా ఈ సినిమా టీజర్ కూడా విడుదలై ఆకట్టుకుంది. చూడాలి మరి ఈ రెండు చిత్రాలతో రాజ్​ తరుణ్​ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో.


Advertisement

Recent Random Post:

The GOAT Pre Release Event LIVE | Thalapathy Vijay | Venkat Prabhu | Yuvan Shankar Raja

Posted : September 2, 2024 at 8:04 pm IST by ManaTeluguMovies

The GOAT Pre Release Event LIVE | Thalapathy Vijay | Venkat Prabhu | Yuvan Shankar Raja

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement