అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలోనే సినిమా దసరా లేదా దీపావళికి వచ్చేది. కాని ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది సమ్మర్ వరకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ లుక్ పై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఎర్ర చందనం స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా బన్నీ కనిపించబోతున్నట్లుగా సుకుమార్ ఫస్ట్‌లుక్‌తోనే చెప్పేశాడు.
ఈ సినిమాలు బన్నీ మరో లుక్‌లో కూడా కనిపిస్తాడని అంటున్నారు. బన్నీ రెండవ లుక్ సినిమాకు చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. రెండవ లుక్‌లో మాస్‌గా కాకుండా క్లాస్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ రెండు విభిన్నమైన లుక్స్‌తో కనిపించబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. బన్నీ అసలు ఫారెస్ట్ ఆఫీసర్, కాని కొన్ని కారణాల వల్ల ఎర్ర చందనం స్మగ్లర్ గెటప్‌లో సినిమాలో కనిపిస్తాడు.
సినిమా మెయిన్ పాయింట్ అది అంటూ కొందరు ఊహించేస్తున్నారు. బన్నీ సెకండ్ గెటప్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ కథ చిన్నదే తీసుకుని దాన్ని అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో చూపించడం చేస్తూ ఉంటాడు. అలాగే పుష్ప చిత్రాన్ని కూడా అలాగే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో చూపించబోతున్నట్లుగా ఆయన ఫ్యాన్స్ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్‌ని బన్నీ కొట్టడం ఖాయం అంటూ నమ్మకంగా ఉన్నారు.