Advertisement

చిరు సినిమా వదులుకునేటంత మూర్ఖుడిని కాదు – హరీష్

Posted : May 15, 2020 at 2:17 pm IST by ManaTeluguMovies

కమర్షియల్ మీటర్ తెలిసిన దర్శకులలో హరీష్ శంకర్ ఒకరు. మనసు పెట్టి సినిమా తీస్తే కమర్షియల్ గా హరీష్ శంకర్ సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి. దానికి మిరపకాయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలే చక్కటి ఉదాహరణ. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాను ఓకే చేసుకున్న హరీష్, దానికి తగిన స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏ మాత్రం నిరాశ చెందని విధంగా ఈ సినిమా ఉండబోతుందని భరోసా ఇచ్చాడు హరీష్ శంకర్.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ సినిమా మొదలవ్వడానికి మరింత సమయం పట్టనుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి ముందు మరో రెండు సినిమాలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హరీష్ మరో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. దీన్ని దర్శకుడు తోసిపుచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయ్యాకే మరో సినిమా చేస్తానని, అంతవరకూ వెబ్ సిరీస్ చేసే అవకాశం ఉంది కానీ మరో సినిమా మాత్రం చేయనని తెలిపాడు.

అలాగే లూసిఫెర్ రీమేక్ ముందుగా మీకే వచ్చిందటగా కానీ వద్దనుకున్నారెందుకు అని ప్రశ్నించగా మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకునేటంత మూర్ఖుడిని అయితే కాదు అని తెలిపాడు. అంటే అసలు హరీష్ శంకర్ ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎవరూ అప్రోచ్ అవ్వలేదన్నమాట.


Advertisement

Recent Random Post:

Political Mirchi : వెంటాడుతున్న గతం..వర్మ, పోసానికి కేసుల భయం

Posted : November 21, 2024 at 10:29 pm IST by ManaTeluguMovies

Political Mirchi : వెంటాడుతున్న గతం..వర్మ, పోసానికి కేసుల భయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad