Advertisement

నూతన్ నాయుడు..సినీ నిర్మాత

Posted : August 30, 2020 at 12:21 pm IST by ManaTeluguMovies

ఆఖరికి నూతన్ నాయుడు విజిటింగ్ కార్డు అలా మారింది. నూతన్ నాయుడు బాగా చదువుకున్నారు. బోలెడు డిగ్రీలు సంపాదించారు. పలు సంస్థలకు వివిధ రకాలుగా సేవలు అందించారు. మోటివేషన్ స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర పార్టీ , జనసేన పార్టీల అభిమానిగా, పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి, బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా మారి, ఇలా రకరకాలుగా ప్రస్థానాలు సాగించినా, ఆఖరికి నూతన్ నాయుడు పేరు పక్కన సినీ నిర్మాత అని మాత్రమే చేరింది.

కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసారు అని వార్తలు వున్నాయి. అలాగే సమైక్యాంధ్ర పార్టీ కి కీలక బాధ్యుడిగా వున్నారు. సమైక్యాంధ్ర పార్టీకి వెళ్లక ముందు కొద్ది రోజులు వైకాపాతో కూడా సంబంధాలు కొనసాగించారు. కానీ అంతలోనే రాజీనామా చేసి వెళ్లి జై సమైక్యాంధ్రలో చేరారు. ప్రజారాజ్యం ప్రారంభంలో కూడా ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇలా ఏ పార్టీ వస్తే ఆ పార్టీతో సంబంధాలు పెట్టుకోవడం ఆయనకు అలవాటుగా మారిందనే టాక్ వుంది. విద్యార్థి దశలో ఎస్ఎఫ్ఐ తో వుండేవారని అంటారు. అంటే దాదాపు అన్ని పార్టీలతోనూ ఆయనకు సంబంధాలు వున్నాయనుకోవాలి.

నిన్నటికి నిన్న నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దౌర్జన్య సంఘటను ఈ రోజు మీడియా అంతా కవర్ చేసింది. కానీ ప్రతి మీడియా కూడా నూతన్ నాయుడును సినీ నిర్మాత అని మాత్రమే పేర్కొనడం విశేషం. కనీసం పార్టీల సంగతి పక్కన పెట్టి క్రియాశీలక రాజకీయ నాయకుడు అని కూడా పేర్కొనలేదు.

సాక్షి మినహా మిగిలిన మీడియా ఏదీ నూతన్ నాయుడు ప్రస్థానం, ఆయన వ్యాపార భాగస్వామ్యాల గురించి ప్రస్తావించలేదు. నూతన్ నాయుడు కాస్త చెప్పుకోదగ్గ సినిమా నిర్మాత కానే కాదు. ఈ మధ్యనే ఓ ఓటిటి షార్ట్ ఫిలిం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా తీసారు. అదే ఇప్పుడు ఆయనకు సినీ నిర్మాత అనే ట్యాగ్ లైన్ ఇచ్చేసింది.

ఇలా సినీ నిర్మాత అని అనకపోతే, రాజకీయ నాయకుడు అని అనాల్సి వస్తుంది. అలా అంటే ఏ పార్టీ?ఏప్పుడు ఏ పార్టీ తరపున పోటీ చేసారు? ఇవన్నీ వస్తాయి. అవన్నీ వస్తే వేరుగా వుంటుంది వ్యవహారం. అందుకే సినిమా నిర్మాత అనేస్తే ఇవన్నీ పక్కకు పోతాయి. అయినా సినిమా నిర్మాత దేనికి? పవన్ కళ్యాణ్ కు మద్దతుగా, దర్శకుడు ఆర్జీవీకి వ్యతిరేకంగా తీసిన పరాన్న జీవి కే కదా?


Advertisement

Recent Random Post:

Tirumala Laddu Issue : నేతల మధ్య పర్సనల్ ఎటాక్ కి కారణమైన కల్తీ వివాదం | Kodali Nani | Pawan kalyan

Posted : September 26, 2024 at 11:41 am IST by ManaTeluguMovies

Tirumala Laddu Issue : నేతల మధ్య పర్సనల్ ఎటాక్ కి కారణమైన కల్తీ వివాదం | Kodali Nani | Pawan kalyan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad