Advertisement

ఎన్.టి.ఆర్ కోసం తన లక్కీ మస్కట్ ని ఫిక్స్ చేస్తున్న త్రివిక్రమ్?

Posted : September 29, 2020 at 11:58 am IST by ManaTeluguMovies

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. కోవిడ్ [పరిస్థితులు సెట్ కాగానే మొదటగా ఆ సినిమాకి సంబందించిన షూటింగ్ ని ఫినిష్ చేసాడు. అలాగే తన 30వ సినిమాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

మాకు అందిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్.టి.ఆర్ సినిమా కోసం తన లక్కీ మస్కట్ లా మారిన అందాల భామ పూజ హెగ్డే ని మూడవ సారి రిపీట్ చెయ్యడానికి ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే త్రివిక్రమ్ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలలో కనిపించి సూపర్ హిట్స్ అందుకుంది.

త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ తో చేయనున్న సినిమాకి కూడా పూజ హెడ్జ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పడంతో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పూజ పలు సినిమాలు కమిట్ అయ్యి ఉండడం, వాటిని ఫినిష్ చెయ్యడానికి కాస్త సమయమే పట్టేలా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఎప్పుసిడ్ సెట్స్ కి వెళ్తుంది అనే విషయంపై క్లారిటీ లేని ఎన్.టి.ఆర్ – త్రివిక్రమ్ సినిమాకి సముఖత చూపుతుందా లేదా అనేది చూడాలి.

అలాగే పూజ ప్రస్తుతం 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తోంది. ఆ పరంగా కూడా ప్రొడక్షన్ టీం ఆలోచనలో ఉందని సమాచారం.


Advertisement

Recent Random Post:

చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానానికి తప్పిన పెనుముప్పు | Chennai Airport

Posted : September 25, 2024 at 11:57 am IST by ManaTeluguMovies

చెన్నై ఎయిర్ పోర్ట్ లో విమానానికి తప్పిన పెనుముప్పు | Chennai Airport

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad