Advertisement

మంచి రొమాంటిక్ ఫీల్ తో అల్లు శిరీష్ ప్రేమ కాదంట

Posted : May 30, 2021 at 9:11 pm IST by ManaTeluguMovies

యంగ్ మెగా హీరో అల్లు శిరీష్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు కానీ ఎందుకో సక్సెస్ మాత్రం తన దరిచేరడం లేదు. సినిమా సినిమాకూ ఎక్కువ గ్యాప్ తీసుకోవడం, ఆ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను రంజింపచేయకపోవడంతో శిరీష్ కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదు.

అయితే మరోసారి కెరీర్ లో భారీ బ్రేక్ తీసుకున్న శిరీష్, రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్నాడు. శిరీష్ కొత్త సినిమాకు ప్రేమ కాదంట టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఈ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ తీసుకున్నారు. చాలా కాలం తర్వాత అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఇది పూర్తిగా ఫ్రెష్ ఫీల్ తో రొమాంటిక్ వైబ్స్ ఇస్తోంది. రాకేష్ శశి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా జీఏ2 మూవీస్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

రూటు మార్చిన చిరుత..భయాందోళనలో ప్రజలు | Leopard Changed Route at Rajamahendravaram

Posted : September 26, 2024 at 1:50 pm IST by ManaTeluguMovies

రూటు మార్చిన చిరుత..భయాందోళనలో ప్రజలు | Leopard Changed Route at Rajamahendravaram

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad