Advertisement

`హరి హర వీర మల్లు` స్క్రిప్ట్ రీడింగ్ సెషన్

Posted : December 20, 2021 at 9:53 pm IST by ManaTeluguMovies

మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్` చిత్రంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. కోవిడ్ మహమ్మారి కొంత ఉపశమించిన సమయంలో ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించిన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా విజయంలో రెట్టించిన ఉత్సాహంతో వున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస చిత్రాల్ని అంగీకరించారు. అందులో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా `హరి హర వీర మల్లు`.

17 వ శాతాబ్దం నేపథ్యంలో మొఘల్ కాలం నాటి పరిస్థితుల కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కోహినూర్ వజ్రం చుట్టూ ప్రధానంగా సాగే ఈ పిరియాడిక్ డ్రామాలో పవన కల్యాణ్ రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచేసింది. క్రిష్ టేకింగ్ .. అలనాటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా వేసిన సెట్ లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో మెఘల్ రాణి రోషనారగా నర్గీస్ ఫక్రీ కనిపించబోతోంది.

ఇదిల వుంటే ఈ మూవీ స్క్రీప్ట్ రీడింగ్ సెషన్ ని మరోసారి మొదలు పెట్టారు. సినిమా స్టార్ట్ చేసి మధ్యలో కోవిడ్ కారణంగా ఆపేయడంతో మరోసారి స్క్రీప్ట్ రీడింగ్ సెషన్ ని పవన్ తో స్టార్ట్ చేయించారు దర్శకుడు క్రిష్. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. పవన్ సోఫాలో కూర్చుంటే పక్కనే క్రిష్ కూర్చుని స్క్రీప్ట్ ని పవన్ చేత రీడింగ్ చేయిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభిచాలనే తాజాగా స్క్రీప్ట్ రీడింగ్ సెషన్ ని క్రిష్ మొదలుపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎం. రత్నం ఏ. దాయాకర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా జ్ఞాన శేఖర్ వీ ఎస్ సంగీతం ఎం.ఎం. కీరవాణి ఆక్వామెన్ వార్ క్రాఫ్ట్ స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవాకెన్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ ఎక్స్ ఇంచార్జ్ గా వర్క్ చేసినన బెన్ లాక్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. పవన్ కెరీర్ లోనే సరికొత్త చిత్రంగా నిలవనున్న ఈ సినిమాని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

పెళ్లి కొడుకు కోసం ట్రైన్ ఆపేసిన రైల్వే శాఖ | Railways Detain Connecting Train For Marriage

Posted : November 19, 2024 at 1:30 pm IST by ManaTeluguMovies

పెళ్లి కొడుకు కోసం ట్రైన్ ఆపేసిన రైల్వే శాఖ | Railways Detain Connecting Train For Marriage

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad