Advertisement

ఆకాశం నీ హద్దురా సూర్య పాత్రకు టాలెంటెడ్ నటుడి డబ్బింగ్

Posted : October 2, 2020 at 11:03 pm IST by ManaTeluguMovies

వరస ప్లాపులతో సూర్య ఇబ్బందిపడుతోన్న విషయం తెల్సిందే. సూర్య నటించిన సినిమాలు అన్నీ ఈ మధ్య కాలంలో అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ నిరుత్సాహపరిచాయి. మెయిన్ గా కథల ఎంపికలో సూర్య చేసిన తప్పిదాలే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే సూర్య రీసెంట్ గా చేసిన సినిమా ఆకాశం నీ హద్దురా.

గురు ఫేమ్ సుధ కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందే పూర్తయిపోయింది. ఏప్రిల్ లేదా మేలో విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా ప్రభావం కారణంగా అది సాధ్యపడలేదు. దీంతో సూర్య సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. అక్టోబర్ 30న సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాపై సూర్య చాలానే ఆశలు పెట్టుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూర్యకు టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీ.ఆర్. రామస్వామి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

Andhra Ranam 2024 : జగన్ బచ్చా కాదు బాబూ.. హీరో..! | AP Politics | CM Jagan |

Posted : April 20, 2024 at 10:47 pm IST by ManaTeluguMovies

Andhra Ranam 2024 : జగన్ బచ్చా కాదు బాబూ.. హీరో..! | AP Politics | CM Jagan |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement