ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బాలీవుడ్ సూపర్ స్టార్ కూతురు మళ్ళీ ప్రేమలో పడిందా?

బాలీవుడ్ గాసిప్స్ కు ఉండే స్పైస్ వేరు. అక్కడ సెలబ్రిటీల మధ్య రిలేషన్స్ చాలా త్వరగా ఏర్పడుతుంటాయి. బాలీవుడ్ మీడియా సైతం ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ మీడియా మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ రిలేషన్స్ పై ఫోకస్ పెట్టింది.

నిజానికి ఐరా ఖాన్ తన రిలేషన్స్ విషయంలో ఎప్పుడూ సీక్రెట్ గా మైంటైన్ చేసింది లేదు. గతేడాది బాలీవుడ్ సంగీత దర్శకుడు మిశాల్ తో ప్రేమాయణాన్ని చాలా ఓపెన్ గానే ఉంచింది. అయితే ఇప్పుడది బ్రేకప్ కు దారి తీసినట్లు ఐరా మరో వ్యక్తితో ప్రేమాయణంలో మునిగితేలుతున్నట్లు తెలుస్తోంది.

ఆ వ్యక్తి మరెవరో కాదు ఆమిర్ ఖాన్ పర్సనల్ ట్రైనర్ నుపూర్. లాక్ డౌన్ సమయంలో ఆమిర్ ఖాన్ తో నుపూర్ వర్కౌట్స్ విషయంలో సహాయం చేసాడు. దాంతో పాటు ఐరాకు కూడా ఫిట్నెస్ విషయంలో సూచనలు ఇచ్చాడు. ఇక్కడే వీరి రిలేషన్ బలపడినట్లు తెలుస్తోంది.

ఐరా, నుపూర్ లు ఇద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐరా తల్లి ఈ పెళ్ళికి తన అంగీకారం తెలిపిందిట.

Exit mobile version