ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 102 – అభిజిత్‌ మీరు తెలివైన, మెచ్యూర్డ్‌ కంటెస్టెంట్‌

బిగ్‌ బాస్‌ మరో మూడు రోజుల్లో ముగియబోతుంది. తెలుగు ప్రేక్షకులు నాల్గవ సీజన్ విషయంలో మొదట్లో చాలా ఆసక్తి కనబర్చినా తర్వాత తర్వాత లైట్ తీసుకున్నట్లుగా అనిపించింది. కాని చివర్లో మళ్లీ మంచి ఆధరణతో దూసుకు పోయింది. ఫినాలే వీక్‌ లో పెద్దగా టాస్క్‌ లు ఏమీ లేవు. ఈ వారం మొత్తం కూడా టాప్‌ 5 కంటెస్టెంట్స్ చిల్‌ అవుతున్నారు. బిగ్‌ బాస్ ప్రతి సీజన్‌ లో కూడా కంటెస్టెంట్స్‌ వెళ్లి పోయే ముందు జర్నీ చూపిస్తారు. ఎలిమినేట్‌ అయిన వారు నాగార్జునతో కలిసి జర్నీ చూస్తే ఫైనల్‌ 5 మాత్రం చివరి వారంలో ఇంట్లోనే వారి జర్నీ చూస్తారు. తాజా ఎపిసోడ్‌ లో బిగ్‌ బాస్ అఖిల్‌ మరియు అభిజిత్‌ ల జర్నీని చూపించడం జరిగింది. మొదట అఖిల్‌ జర్నీతో స్టార్ట్‌ అయ్యింది.

ఈ సీజన్‌ లో మోస్ట్‌ డిజైరబుల్‌ మ్యాన్ గా మీరు ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌ లో మీరు ఒక హీరో మాదిరిగా అందరికి ప్రేమను ఎన్నో ఎమోషన్స్‌ ను పంపించారు అంటూ బిగ్ బాస్‌ అఖిల్ ను అభినందించాడు. మీరు చాలా ప్రేమను పంచారు.. మీరు ఇతరుల నుండి ప్రేమను ఆశించారు అంటూ బిగ్‌ బాస్‌ మీ ప్రదర్శణకు చాలా సంతృప్తిగా ఉన్నారు. మీకు ఈ హౌస్‌లో చాలా మంచి సంబంధాలు ఉన్నాయని అఖిల్ ను ఉద్దేశించి బిగ్‌ బాస్ వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత జర్నీని చూపించారు. అఖిల్‌ జర్నీలో అన్ని ఎమోషన్స్‌ కనిపించాయి. మొదటి రోజు నుండి మాజీ కంటెస్టెంట్స్‌ వచ్చే వరకు అన్ని రకాల ఎమోషన్స్‌ ను అఖిల్ జర్నీలో చూపించారు.

అఖిల్‌ తర్వాత అభిజిత్‌ గార్డెన్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన సెటప్‌ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ అభిజిత్‌ నిల్చుని ఉండగా బిగ్‌ బాస్‌ మాట్లడుతూ మీరు చాలా తెలివైన మరియు మెచ్యూర్డ్‌ కంటెస్టెంట్‌. మీలాంటి వారు ఈ హౌస్‌ లో ఉండటం బిగ్‌ బాస్‌ కు గర్వకారణం. మీరు ఈ హౌస్‌లో ఎన్నో ఎమోషన్స్‌ ను చవి చూశారు. మీరు కొన్ని సందర్బాల్లో లోన్లీగా ఫీల్‌ అయ్యారు. మీరు ఎంతో మందికి మద్దతుగా నిలిచారు. ప్రతి ఒక్క క్రిటికల్‌ సందర్బంలో కూడా మీరు ఇతరుల కోసం స్టాండ్‌ తీసుకున్నారు అంటూ బిగ్‌ బాస్‌ అభిజిత్‌ పై ప్రశంసలు కురిపించాడు. బిగ్‌ బాస్‌ వ్యాఖ్యలతో అభిజిత్‌ ఈ సీజన్‌ విజేత అంటూ మరింత క్లారిటీ వచ్చేసింది.

Exit mobile version