అలాగే రిటైర్డ్ జెడి జనార్దన్, సూపరింటెండెంట్ ఎంకెబి. చక్రవర్తి మీద కూడా సస్పెన్షన్ వేటు వేశారు. ఈ. రమేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ కూడా అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఏపీలోని టిడిపి – వైఎస్సార్సీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడిని బలవంతంగా కిడ్నాప్ చేశారని అన్నారు.
ఫైనల్ గా ఈ విషయంపై విశాఖపట్నం ఏసీబీ డిఎస్పీ రవికుమార్ స్పందించారు. ‘ESI అక్రమాలపై విజిలెన్స్ అందించిన నివేదికని ప్రభుత్వం ఏసీబీకి ఇచ్చింది. దీనిపై ఏసీబీ మళ్ళీ పూర్తి విచారణ చేసి నిందితులను గుర్తించింది. మా దర్యాప్తులో అక్రమాలు పక్కాగా నిర్దారణ అయ్యాకే నిందితులని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసిన వారందరినీ ఈ రోజు సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తాము. టెలి హెల్త్ లో సర్వీస్ చెయని వారికి కూడా సేవలు ఇచ్చారు. బయో హెల్త్ లో కూడా నిధుల దుర్వినియోగం జరిగింది. రమేష్ కుమార్ బంధువులు పేర్ల మీద, బోగస్ కంపెనీ పేర్లతో భారీగానే అక్రమ లావాదేవీలు జరిగాయి. అసలు టెండర్లకు పిలవకుండా నామినేషన్ మీద ఇచ్చేసి, మినిస్టర్ ఎండార్స్మెంట్ ఆధారంగా కేటాయింపులు జరిగాయి. వీటికి సంబందించిన సెక్రటరీ ద్వారా జరగాల్సిన పనులు మాత్రం మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో నేరుగా జరిజె అవకాశం ఉందని ఉండొచ్చని’ తెలిపారు.