Advertisement

నటి ఆండ్రియా సంచలనం..! ఓ సన్నివేశంలో నగ్నంగా..

Posted : June 13, 2021 at 7:08 pm IST by ManaTeluguMovies

తమిళ సినిమాల్లో కథానాయికగా పేరున్న ఆండ్రియా న్యూడ్ సీన్‌లో నటించినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అండ్రియా నటించిన ‘పిశాసు-2’ చిత్రంలో ఇలా నటించినట్టు తెలుస్తోంది. మిష్కిన్ దర్శకత్వంలో 2016లో విడుదలైన ‘పిశాసు’ చిత్రానికి ఇది రెండో భాగంగా తెరకెక్కుతోంది. పూర్ణ, రాజ్‌కుమార్‌, పిచ్చుమణిలతోపాటు స్టార్ హీరో విజయ్‌ సేతుపతి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమధ్య షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయాయి.

కథ డిమాండ్‌ మేరకు ఆండ్రియా నగ్నంగా నటించినట్టు తెలుస్తోంది. దర్శకుడు మిష్కిన్‌ సన్నివేశం వివరించడంతో ఆండ్రియా ఈ సాహసం చేసినట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో లొకేషన్‌లో అతికొద్దిమంది మాత్రమే ఉన్నారని తెలుస్తోంది. 2019లో ‘ఆడై’ చిత్రంలో అమలాపాల్‌ కూడా నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. ఆండ్రియాకు తమిళంలో నటిగా, గాయ‌నిగా మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాకు కార్తీక్‌ రాజా సంగీతం సమకూరుస్తున్నారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 19th April 2024

Posted : April 19, 2024 at 10:09 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 19th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement