క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఒక వైపున ఆట .. మరో వైపున ఆశయం .. ఈ రెండింటితో ముడిపడిన జీవితాన్ని గురించి ఈ సినిమా చెబుతుంది. 2019 .. ఏప్రిల్ 19న వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బలమైన కథాకథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి.
తెలుగులో ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇదే కథను హిందీలో రాసుకుని .. షాహిద్ కపూర్ హీరోగా రూపొందించాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు .. సూర్యదేవర నాగవంశీ .. అల్లు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు. సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమా టీమ్ ఈ రోజున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తొలి ఆటతోనే ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాని స్పందించాడు. హిందీ ‘జెర్సీ’ చూశాను .. చాలా బాగుంది. షాహిద్ కపూర్ తన పాత్రకి న్యాయం చేశారు. మృణాల్ ఠాకూర్ .. పంకజ్ కపూర్ .. రోనిత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది.
గౌతమ్ తిన్ననూరి హిందీలోను హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ ” అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశాడు. తెలుగు వెర్షన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన అనిరుధ్ హిందీ వెర్షన్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించడం విశేషం.
ఇక ప్రపంచవ్యాప్తంగా ‘జెర్సీ’ సినిమాకి సంబంధించి వస్తున్న టాక్ పట్ల షాహిద్ కపూర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రెడిట్ అంతా కూడా గౌతమ్ తిన్ననూరికి చెందుతుందని చెప్పాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఉండనుంది.
అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా ఆయన నడిపిస్తూనే వస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచే కథ కాదనీ యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.