Advertisement

సుకుమార్ లాజిక్ మిస్ అయిన నాని!

Posted : June 7, 2022 at 6:21 pm IST by ManaTeluguMovies

ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సినిమాపై జరుగుతోన్న చర్చ అంతా ఇంతా కాదు. మాట్లాడితే పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియాపై డిబేట్లు కూడా నడిచాయి. హీరోలు..నిర్మాతలు..దర్శకులు సైతం పాన్ ఇండియా అంటే ఏంటి? అన్న దానిపై ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్లు వెల్లడించారు. ఇంకొంత మందైతే పాన్ ఇండియా స్టార్లు ఇండియాలో ఇప్పుడు కాదు…మూడు నాలుగ దశాబ్ధాల క్రితమే పుట్టారని నేటి స్టార్లపై పరోక్షంగా పంచ్ లు సైతం వదిలారు.

ఇక్కడ ఎవరు ఒపీనియన్ ఎలా ఉన్నా? పాన్ ఇండియా అంటే మాత్రం ఒకటే చెప్పాలిక్కడ. అన్ని భాషల ప్రేక్షకులు ఒక చిత్రాన్ని అదరిస్తే గనుక అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. నిజమే అలాగే చాలా మంది చెప్పారు. కానీ చెప్పే విధానంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. తమ నేటివిటీని చాటుకునే క్రమంలోనే పాన్ ఇండియాపై అభిప్రాయాలపై తప్పులు దొర్లుతున్నాయని ఆ తర్వాతే అర్ధమవుతుంది.

ఇటీవలే నటుడు సిద్దార్థ్ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు కాదు..కొన్ని దశాబ్ధాల క్రితమే తమ బాస్ మణిరత్నం తీసారన్నారు. అదే ‘రోజా’ సినిమా. ఈ సినిమాని అన్ని భాషల ప్రేక్షకులు చూసారు. కాబట్టి తొలి పాన్ ఇండియా ఇదే అవుతుంది. పాన్ ఇండియా స్టార్ అరవింద్ స్వామి అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే క్రమంలో తన స్నేహితుడు ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్-2 ప్రశంసించాడు.

కానీ బాస్ కి ఇచ్చిన ప్రయర్టీ ప్రెండ్ కి ఇవ్వ లేదని అర్ధమువుతుంది. అసలు పాన్ ఇండియా పదమే నాన్సెన్స్ అనేసాడు. అంటే ఇప్పుడొస్తున్న సినిమాలేవి పాన్ ఇండియా కాదు అని పరోక్షంగా కామెంట్ చేసాడు. ఇంకా కోలీవుడ్ హీరో విజయ్ కూడా పాన్ ఇండియా సినిమాలపై పరోక్షంగా కామెంట్లు గుప్పించారు. ఇక బాలీవుడ్ లో కొందరు ఉద్దండులు సైతం ఇంతకు మించిన వ్యతిరేకతని వ్యక్తం చేసిన వైఖరి బహిర్గతమైంది.

తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా పాన్ ఇండియా సినిమాపై సంచలన వ్యాఖ్య లు చేసారు. అయితే అతని వ్యాఖ్యల్లో వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదు గానీ..పాన్ ఇండియాపై లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తుంది. అందరూ చూస్తే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ‘పుష్ప’ చిత్రాన్ని అందరూ చూసారు కాబట్టి అది పాన్ ఇండియా కేటగిరీలోకి వెళ్తుంది. కానీ ఇక్కడ నేపథ్యానికి..బాలీవుడ్ లో ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి సంబంధం ఏముంది? అన్న తీరులో నాని వ్యాఖ్యలు కనిపిసక్తున్నాయి.

ఇక్కడే నాని లాజిక్ మిస్ అయ్యారు. అడవుల నేపథ్యం అనేది యూనిక్ పాయింట్…యూనివర్శల్ గా కనెక్ట్ అవ్వడానికి ఆస్కార ఉంది. పైగా అది ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం. దేశ వ్యాప్తంగా సంచలనమైన అంశమది. ఇది కూడా అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్. వీటికి నేటివిటీతో ఏ మాత్రం సంబంధం లేదు. నేటివిటీతో సంబంధం కలిగి ఉంటే గనుక అది పాన్ ఇండియా కేటగిరికి రాదు.

ప్రాంతీయంగానే పరిమితం చేయాల్సి ఉంటుంది. కానీ పుష్ప ప్రాంతీయ భాషా చిత్రం కాదు. అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే చిత్రం. సుకుమార్ ఇదే లాజిక్ తో పుష్పని పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. కానీ నాని వ్యాఖ్యల్లో ఈ లాజిక్ మిస్ అయినట్లు స్ఫష్టంగా కనిపిస్తుంది.

మరి ఈ లాజిక్ నిజంగా మిస్ అయిందా? మిస్ చేసారా? అన్నది ఆయనకే తెలియాలి. ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవుతోన్న చిత్రాలపై పట్ల ప్రశంలతో పాటు..విమర్శలు చేసే వాళ్లు లేకపోలేదు. మరి నాని లె క్క ఏంటో.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 22nd March 2024

Posted : March 22, 2024 at 10:45 pm IST by ManaTeluguMovies

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement