ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై మాట్లాడడానికి భయపడే హీరోయిన్ల ఆలోచనలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు బాహాటంగానే తమకు జరిగిన అన్యాయాన్ని చెబుతున్నారు.

ఇంకా కొంత మంది తమకు అలాంటి అనుభవాలు ఎదురవ్వలేదు అని దాటివేస్తున్నా కొందరు హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో బోల్డ్ గా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకుంటున్న ఐశ్వర్య రాజేష్ కూడా ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నానని చెబుతోంది. కెరీర్ మొదట్లో తాను కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని అంటోంది.

ఐశ్వర్య రాజేష్ అంటే సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన అమ్మాయే. ప్రముఖ నటుడు రాజేష్ కూతురు, ప్రముఖ నటి శ్రీలక్ష్మి మేనకోడలు ఈ ఐశ్వర్య రాజేష్. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా కూడా లైంగిక వేధింపులు తప్పలేదంటే ఇక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

ఇంకా ఐశ్వర్య మాట్లాడుతూ లైంగిక వేధింపులు కాకుండా తాను కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని, పారితోషికాలు మొదట చెప్పిన ప్రకారం చెల్లించేవారు కాదు. నా శరీర ఛాయను సాకుగా చూపేవారు. పైగా ఉత్తరాది హీరోయిన్ల నుండి మాకు గట్టి పోటీ ఉంటుంది. వాళ్ళలా మేము కనిపించలేం. వాళ్ళలా గ్లామర్ గా ఉండలేం కాబట్టి ఎక్కువ అవకాశాలు వాళ్ళకే వెళ్లిపోతాయి. అయినా నాకు సవాళ్లు కొత్తేమి కాదు. సమస్యల్ని స్వీకరించడం నాకు తెలుసు. ఎవరూ నన్ను నమ్మనప్పుడు నన్ను నేను నమ్మాను. బాధల్ని ఓర్చుకోగలిగాను అంటోంది ఐశ్వర్య రాజేష్.

Exit mobile version