ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

తమిళ హీరో అజిత్ కు షూటింగ్ లో ప్రమాదం.. చెయ్యి, కాలికి గాయాలు

సినీ హీరోలు ఫైట్ సీక్వెన్సెస్ లో ఒక్కోసారి గాయపడుతూ ఉంటారు. డూప్స్ ఉన్నా ఒక్కోసారి ఇవి తప్పవు. ప్రస్తుతం ప్రముఖ తమిళ స్టార్ హీరో అజిత్ కు ఇలానే షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఆయన నటిస్తున్న ‘వలిమై’ సినిమా షూటింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ లో భాగంగా ఆయన బైక్ పై స్టంట్స్ చేస్తూండగా ప్రమాదం జరిగి గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాళ్లకు గాయాలయ్యాయి. డూప్ లేకుండా ఈ స్టంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

ప్రమాదం జరిగిన వెంటనే అజిత్ ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అజిత్ గాయంతో షూటింగ్ కొన్నాళ్లు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సినిమాలో అజిత్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బోనీ కపూర్ నిర్మాత. అజిత్ సరసన హ్యూమా ఖురేషీ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు హీరో కార్తికేయ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

లాక్ డౌన్ కు మందు ఫిబ్రవరిలో కూడా వలిమై సినిమా షూటింగ్ లోనే ఆయన గాయపడ్డారు. ఇప్పుడు హైదరాబాద్ లో మరోసారి గాయపడ్డారు. ఈ బైక్ స్టంట్ కోసం చెన్నై నుంచి ప్రత్యేకించి బైక్ తెప్పించుకున్నారని తెలుస్తోంది. బైక్ నడపడం అజిత్ కు ఇష్టం కావడంతో ఈ సీన్ ను డూప్ లేకుండా చేసారని అంటున్నారు

Exit mobile version