Advertisement

జనవరిలో అఖిల్ – సురేందర్ రెడ్డి చిత్ర షూటింగ్ షురూ

Posted : December 20, 2020 at 8:14 pm IST by ManaTeluguMovies

అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన 4వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అన్న టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ నెలలోనే చిత్ర షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు దర్శకనిర్మాతలు.

ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో సంక్రాంతి పండగ తర్వాత మొదలువుతుంది అన్నది తాజా సమాచారం. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ సహాయంతో నిర్మించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.


Advertisement

Recent Random Post:

ISRO Successfully Tested RLVEX-02 Reusable Vehicle Launch | in Chitradura

Posted : March 23, 2024 at 1:05 pm IST by ManaTeluguMovies

ISRO Successfully Tested RLVEX-02 Reusable Vehicle Launch | in Chitradura

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement