ఈ చిత్రం తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించనున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో సంక్రాంతి పండగ తర్వాత మొదలువుతుంది అన్నది తాజా సమాచారం. అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ సహాయంతో నిర్మించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.