Advertisement

సురేందర్ బ్యాక్ టు అఖిల్

Posted : July 9, 2020 at 6:20 pm IST by ManaTeluguMovies

సైరా సినిమా తరువాత సినిమా సెట్ చేసుకోవడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి కిందా అవుతున్నట్లు కనిపిస్తోంది. సైరా సినిమా ఫలితం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఆ తరవాత సురేందర్ రెడ్డి ఓ సినిమాను అఖిల్ తో చేస్తారని టాక్ వినిపించింది. ఆ మేరకు కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయి. కానీ ఏమయిందో తెలియదు. వరుణ్ తేజ్ పేరు లైన్ లోకి వచ్చింది. క్రిష్ కథ, నిర్మాణంలో సురేందర్ రెడ్డి డైరక్షన్లో సినిమా అని వార్తలు వచ్చాయి.

కానీ ఈ మధ్య మళ్లీ అది పక్కకు వెళ్లింది. రామ్ హీరోగా వక్కంతం వంశీ కథతో సినిమాతో సురేందర్ రెడ్డి సినిమా అన్న వార్తలు బయటకు వచ్చాయి. రెడ్ సినిమా తరువాత రామ్ చేయబోయే సినిమా ఇదే అన్న టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ న్యూస్ లు వేరుగా వున్నాయి.

సురేందర్ రెడ్డి మళ్లీ ఇప్పుడు అఖిల్ దగ్గరకే వెళ్తున్నారని తెలుస్తోంది. అఖిల్ ప్రస్తుతం చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ సినిమా తరువాత చేయబోయే సినిమా సురేందర్ రెడ్డితో అనే వినిపిస్తోంది. అయితే అలా అని మిగిలిన సినిమాలు చేయరని కాదని, అవి అలా లైన్లో వుంటాయని, అఖిల్ సినిమా తరువాత చేస్తారని అంటున్నారు. మొత్తానికి సురేందర్ సినిమా స్టార్ట్ అయ్యే లోగా మరెన్ని వార్తలు వస్తాయో?


Advertisement

Recent Random Post:

వీరవల్లి రోడ్ లో జగన్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం | CM Jagan Bus Yatra

Posted : April 15, 2024 at 1:52 pm IST by ManaTeluguMovies

వీరవల్లి రోడ్ లో జగన్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజానీకం | CM Jagan Bus Yatra

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement