Advertisement

అక్కినేని అభిమానులకి అఖిల్ శుభవార్త.!

Posted : July 25, 2020 at 2:43 pm IST by ManaTeluguMovies

సరైన హిట్ లేక ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అక్కినేని అఖిల్ అంతే పంతంతో ఈ సారి హిట్ కొట్టి బ్యాక్ టు ఫామ్ అనిపించుకోవాలనుకుంటున్న బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కరోనా అనేది లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే థియేటర్స్ లో సందడి చేసి ఉండేది. లాక్ డౌన్ సమయానికి మరో 25% షూటింగ్ బాలన్స్ ఉంది.

ఇప్పుడప్పుడే షూటింగ్ లు మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు కావున ఈ ఏడాది ఈ సినిమా రిలీజ్ ఉండే అవకాశం లేదని సమాచారం. కానీ ఈ చిత్ర టీం ఆగస్టులో అక్కినేని అభిమానుల కోసం స్పెషల్ సర్ప్రైజ్ ని ప్లాన్ చేస్తున్నారు. అదేమిటంటే ఈ చిత్ర టీజర్ ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందులోనూ ఎక్కువ భాగం ఆగష్టు నెలాఖరున నాగార్జున బర్త్ డే కానుకగా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

పూజ హెగ్డే ఇందులో స్టాండప్ కమెడియన్ గా కనిపించి, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తెగ నవ్విస్తుందని తెలుస్తోంది. బన్నీ వాసు జిఏ2 బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


Advertisement

Recent Random Post:

Gam Gam Ganesha Movie New TEASER | Anand Devarakonda | Pragati Srivastava

Posted : April 16, 2024 at 5:58 pm IST by ManaTeluguMovies

Gam Gam Ganesha Movie New TEASER | Anand Devarakonda | Pragati Srivastava

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement