Advertisement

అక్కినేని కుటుంబంలోనే ఇలా ఎందుకని?

Posted : October 5, 2021 at 12:14 pm IST by ManaTeluguMovies

`మనం` సినిమాలో నటించిన క్రమంలో లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఓవైపు క్యాన్సర్ వ్యాధి తనని కబళిస్తోందని ఎంతో ధైర్యంగా ప్రకటించిన ఏఎన్నార్ తుది శ్వాస వరకూ నటిస్తానని అది తన అదృష్టమని అన్నారు.. తన మనవళ్లతో కలిసి నటించడాన్ని ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఇకపోతే తన కుటుంబంలో కొన్ని సంఘటనలు తనని కలచివేసాయని కూడా గుర్తు చేశారు.

ఏఎన్నార్ చాలా సందర్భాల్లో తన ప్రియాతి ప్రియమైన మనవడు సుమంత్.. మనవరాలు సుప్రియ విడాకుల ప్రహసనంతో ఒంటరి అవ్వడం ఎంతో బాధ కలిగించిందని అన్నారు. ఇక అక్కినేని నాగార్జున విడాకుల అంశం కూడా ప్రతిసారీ అభిమానుల్లో వినిపిస్తుంటుంది. అక్కినేని కుటుంబంలో తొలి విడాకులు నాగార్జునదే. ఆయన విక్టరీ వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుబాటిని పెళ్లాడారు. ఈ జంటకు ఏకైక సంతానం నాగచైతన్య. కానీ నాగ్ – లక్ష్మి మనస్ఫర్థల కారణంగా విడిపోయారు.

నాగార్జున మొదలు ప్రతి జనరేషన్ లో విడాకుల ప్రహసనం కనిపిస్తోంది. ఇది నిజంగా శాపమని కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ అందాల కథానాయిక కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ ఈ కులాంతర వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. కీర్తి రెడ్డి నుండి విడాకులు తీసుకున్నా సుమంత్ ఒంటరిగా ఉన్నాడు. కీర్తి వేరొకరిని పెళ్లాడారు. సుమంత్ సోదరి సుప్రియ కూడా తన భర్త నుండి విడిపోయారు. నాగ చైతన్య – సమంతల వివాహం కూడా కేవలం నాలుగు సంవత్సరాలలో ముగిసింది. వారు విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అఖిల్ అక్కినేని ఇంకా పెళ్లి చేసుకోనప్పటికీ ఇప్పటికే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అక్కినేని కుటుంబంలో ఈ పరిస్థితులు జీర్ణించుకోలేనివనేది అభిమానుల అభిప్రాయం.

మైండ్ బ్లాంక్ అయ్యిందన్న సామ్ తండ్రి

అక్కినేని నాగచైతన్య- సమంత జంట విడిపోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చై-సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించగానే అభిమానులు పెద్ద షాక్ తిన్నారు. గత కొంతకాలంగా మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నా అవేవీ నిజం కావనే అంతా బలంగా నమ్మారు. కానీ అంతలోనే అన్నిటికీ చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చేశారు.

చైతూ నుంచి సమంత విడిపోతోందని తెలిసిన వెంటనే మైండ్ బ్లాంక్ అయిపోయిందని సమంత తండ్రి జోసెఫ్ ప్రభు వ్యాఖ్యానించారు. కానీ సమంత అన్నీ తెలిసే ఇందుకు నిర్ణయించుకుని ఉంటుందని అన్నారు. త్వరలోనే అన్ని పరిస్థితులు మామూలుగా మారిపోతాయి అని.. ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు కూడా మద్దతు ఇస్తూ.. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సమంతకు అండగా నిలవాలని నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు.

సమంత ప్రేమాయణం.. మీడియా వదలదు!

ప్రేమలో పడడం.. ఆ తర్వాత కలిసి జంట షికార్లు.. ఇంకాస్త ముందుకెళ్లి పెద్దల్ని ఒప్పించి పెళ్లితో ఒకటవ్వడం.. అటుపై వేరు కాపురం .. కెరీర్ అంటూ షెడ్యూల్స్ వేసుకోవడం.. ఇదంతా లైఫ్ జర్నీ. ఈ జర్నీలో చై-సామ్ జోడీ ప్రయాణం తెలిసిందే.

అక్కినేని నాగ చైతన్య – సమంత జంట `ఏమాయ చేశావే` (2010) షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా కాలం ప్రేమాయణం సాగింది. కలిసి షికార్లు చేశారు. అటుపై ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి 2017 లో పెళ్లాడుకున్నారు. గోవాలో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ ని అభిమానులు మరువలేరింకా. హిందూ సంప్రదాయం.. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం రెండు వివాహాల గురించి తెలిసిందే. అక్టోబర్ 6 .. అక్టోబర్ 7 తేదీల్లో సెలబ్రేషన్ సాగింది. కొన్నేళ్లుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తరవాత ఆ జర్నీలో ఎన్నో రివల్యూషన్స్ బయటపడ్డాయి. అందుకే ఆ మెమరీస్ ప్రత్యేకమైనవి.

అప్పట్లోనే చై – సామ్ పెళ్లి వీడియో అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రఖ్యాత జోసెఫ్ రాదిక్ షూట్ చేసిన వివాహ వీడియోలో అందమైన గ్లింప్స్ మర్చిపోలేనివి. చైతూ లవ్ ఎఫెక్షన్.. మండపంలోకి అడుగు పెట్టడానికి ముందు చైతన్య వధువు సమంతను చూడటం.. వధువుగా సమంతా మొదటి క్షణాలు.. ఆపై క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ ప్రిపరేషన్ వగైరా.. ఆ వీడియోలో ఆకట్టుకున్నాయి.

ఓ మూవీ ప్రమోషనల్ కార్యక్రమంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ నాగ చైతన్యను ఎప్పుడు సమంతకు ప్రపోజ్ చేశారు అని అడిగితే.. “దాదాపు 10 సంవత్సరాల క్రితం.. ఏ మాయ చెసావే షూటింగులో కలుసుకున్నాం. గత ఏడు సంవత్సరాలుగా సమంతను ఆకట్టుకోవడానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఆమెను వివాహం చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు“ అని సమాధానం ఇచ్చాడు. అంతా బావుంది.. అనుకుంటుండగానే విభేధాలతో ఈ జంట విడిపోవడం అభిమానులు ఊహించనిది.


Advertisement

Recent Random Post:

వివాదంలో పెళ్ళిసందD హీరోయిన్.. శ్రీ లీల నా కూతురు కాదంటున్న వ్యాపారవేత్త

Posted : October 17, 2021 at 8:33 pm IST by ManaTeluguMovies

వివాదంలో పెళ్ళిసందD హీరోయిన్.. శ్రీ లీల నా కూతురు కాదంటున్న వ్యాపారవేత్త

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement