ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

అక్కినేని వారింట ఆడాళ్ళు అది ముట్టుకోరు!

అక్కినేని కుటుంబానికి వండి పెట్టడానికి బోలెడంత మంది కుక్స్ ఉంటారు. అందరూ నటీనటులే కనుక వంట చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఎంతటి సంపన్నులకైనా స్వీయ పాకం చేసుకోవాలని వుంటుందిగా? మరి అలాంటప్పుడు వంట చేయాల్సి వస్తే అక్కినేని లేడీస్ గరిటె పట్టుకుంటారా? తమ ఇంటి కోడలు సమంత అయితే వంట చేయదని అమల అక్కినేని చెప్పేసారు. తమకు నాగార్జున లాంటి సూపర్ ఛెఫ్ ఉండగా వేరే వాళ్ళు ఎందుకని అమల నవ్వేశారు.

అమలకు కూడా వంట అంత బాగా రాదట. ఫామిలీ గెట్ టుగెదర్ వుంటే నాగార్జునే నాలా భీమ పాకం పెట్టేస్తారట. నాన్న నుంచి పాక శాస్త్ర నైపుణ్యం వంట బట్టించుకున్న నాగ చైతన్య కూడా ఇంట్లో ఉన్నపుడు గరిటె తిప్పుతుంటాడని సమంత చాలా సార్లు ఫోటోలు షేర్ చేసింది. మగాళ్లు వంట చేయడం ఏమిటని చాదస్తంగా మాట్లాడేస్తుంటారు కానీ హోటళ్లలో రుచికరమైన వంటలు చేసేదంతా పురుష పుంగవులేగా?

Exit mobile version