అయితే ప్రస్తుతం ఇండియన్- 2 పలు వివాదాల్లో చిక్కుకున్నది. నిర్మాణ సంస్థకు దర్శకుడు శంకర్ కు మధ్య వివాదం నెలకొన్నది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. ఆ లోపు శంకర్.. చరణ్ తో సినిమా తీస్తాడని సమాచారం.
ఇండియన్ -2 నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం కోర్టుకు వెళ్లింది. ముందుగా తమ సినిమా తెరకెక్కించాలని సదరు సంస్థ కోరుతున్నది. అయితే శంకర్ మాత్రం చరణ్‌తో సినిమా చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు.
ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. దీంతో హీరోయిన్ కోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ ను సంప్రదించారు.
అయితే చివరకు అలియానే హీరోయిన్ గా కన్ఫార్మ్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరవైపు శంకర్ తో మెగా పవర్‌స్టార్ చరణ్ సినిమా అనగానే భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇటు తెలుగు అటు తమిళంలో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.